Mrunal Thakur : సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా మంచి గుర్తింపును సంపాదించుకోవాలి అంటే అందం, అభినయంతో పాటు అనుకువ కూడా ఉండాలి. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోయిన్లు చాలా తక్కువ కాలం పాటు వాళ్ళ కెరియర్ ను ఇక్కడ కొనసాగిస్తున్నారు.అదే వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా మారుతుంది. హీరోతో పోల్చుకుంటే వాళ్ల కెరియర్ అనేది చాలా తక్కువ కాబట్టి ఆ తక్కువ పీరియడ్ లోనే వాళ్ళని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే వాళ్ళు కూడా లాంగ్ కెరియర్ ని కొనసాగించవచ్చు అని ఇటీవల చాలామంది హీరోయిన్లు ప్రూవ్ చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే తెలుగులో ‘సీతా రామం’ సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి ‘మృనాల్ ఠాకూర్’… ఇక ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో ‘పూజ మేరీ జాన్’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు అభిమానులకు ఆమె సీతా రామం సినిమాతో చాలా దగ్గరైపోయింది. ఇక ఆ సినిమా తర్వాత తెలుగులో నానితో ‘హాయ్ నాన్న’ అనే సినిమాలో నటించి మెప్పించింది. ఇక రీసెంట్ గా విజయ్ దేవరకొండ హీరో గా వచ్చిన ‘ఫ్యామిలీ స్టార్ ‘ సినిమా లో కూడా నటించి మెప్పించింది. అలాగే కల్కిలో కూడా ఒక చిన్న పాత్రలో తలుక్కున మెరిసింది… టెలివిజన్ రంగం నుంచి సినిమా ఇండస్ట్రీ వరకు ఎదిగిన తన ప్రయాణంలో ఎన్నో ఒడి దొడుకులను ఎదుర్కొన్నప్పటికీ మొత్తానికైతే హీరోయిన్ గా ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయిందనే చెప్పాలి… ఇక ‘పూజా మేరి జాన్’ సినిమా కోసం ఆమె విపరీతంగా కష్టపడిందట. ఆ సినిమా కోసం చాలాసార్లు ఆడిషన్స్ ఇస్తూనే అందులో మెయిన్ లీడ్ దక్కించుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు కూడా చేసిందట…
ఇక ఈ ప్రాసెస్ లో సినిమా యూనిట్ మరికొంతమంది ఆర్టిస్టులను కూడా చూస్తున్నారు. తన ప్లేసును వేరే వాళ్ళతో రిప్లేస్ చేయాలని చూస్తున్నట్టుగా వార్తలు వచ్చాయట. అయినప్పటికీ తను మాత్రం తన నటనతో ఆడిషన్స్ ఇస్తూ తనాల్ను తాను ప్రూవ్ చేసుకొని మొత్తానికైతే ఈ సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది… ఇక ఈ సినిమా పూర్తి అయి దాదాపు రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పుడు ఈ సినిమాని రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు.
ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ సాధిస్తే మృణాల్ ఠాకూర్ కి బాలీవుడ్ లో కూడా మంచి గిరాకీ పెరుగుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పటికే ఈమె తెలుగులో పలు స్టార్ హీరోల సినిమాల్లో కూడా నటించే అవకాశాలను అందుకుంటుంది. కాబట్టి బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటుకుంటే మాత్రం అక్కడ కూడా స్టార్ హీరోల పక్కన నటించే అవకాశాలు వస్తాయంటూ కొంతమంది సినీ మేధావులు వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…
సీతా రామం సినిమాలో సీతగా ప్రేక్షకులను అలరించిన ఆమె నటనలోని వైవిధ్యానికి ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయాడనే చెప్పాలి. ఇక ఇప్పుడు తెలుగులో ఆమెకు వీరాభిమానులు ఉన్నారు. కానీ ఆమె పాన్ ఇండియా వైడ్ గా మంచి గుర్తింపును సంపాదించుకోవాలని చూస్తుంది. కాబట్టి తెలుగు, తమిళ్ అనే తేడా లేకుండా అన్ని భాషల్లో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతుంది…ఇక ఇప్పుడు ఆమె స్టార్ హీరోయిన్ గా ఎదగడం ఒక్కటే తన లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతుంది…