One plus Mobile : వన్ ప్లస్ స్పెషల్ ఆఫర్లు: ఆ ఫోన్ల స్క్రీన్ ను మార్చుకోవచ్చు.. ఎలాంటి ఛార్జీలు ఉండబోవు.. రీకాల్ ప్రకటించిన కంపెనీ..

ప్రపంచంలో యాపిల్ తో పోటీ పడే సత్తా కేవలం వన్ ప్లస్ కు మాత్రమే ఉందని అంతా అంటారు. కానీ వన్ ప్లస్ వాటి ఉత్పత్తుల్లో రాను రాను సమస్యలు తలెత్తుతున్నాయి. ఇది వినియోగదారులకు చికాకు కలిగిస్తోంది.

Written By: NARESH, Updated On : August 1, 2024 10:57 am
Follow us on

One plus Mobile : మీరు వన్ ప్లస్ ఫోన్ యూజర్ అయితే.. కంపెనీ మీ కోసం గొప్ప ఆఫర్ ప్రకటించింది. ఈ బ్రాండ్ అనేక మోడళ్ల డిస్ ప్లేను ఉచితంగా ఛేంజ్ చేస్తోంది. దీంతో పాటు.. కంపెనీ ఉచిత క్లీనింగ్, మెయింటెనెన్స్ సేవను కూడా అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ యూజర్లందరికీ వర్తించదు. ఇందుకోసం కొన్ని షరతులు పాటించాల్సి ఉంటుంది. ఎంపిక చేసిన స్మార్ట్ ఫోన్ యూజర్ల కోసం కంపెనీ ప్రత్యేక ఆఫర్లను జారీ చేసింది. ఈ ఆఫర్ కింద గ్రీన్ లైన్ సమస్యను అధిగమించేందుకు కంపెనీ ఉచిత స్క్రీన్ రీప్లేస్ మెంట్ అందిస్తోంది. భారత్ లో వన్ ప్లస్ ఫోన్లతో గ్రీన్ లైన్ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. వన్ ప్లస్ 8టీ, వన్ ప్లస్ 8ప్రో, వన్ ప్లస్ 9, వన్ ప్లస్ 9ఆర్ స్మార్ట్ ఫోన్లలో ఈ సమస్య కనిపించింది. దీన్ని అధిగమించేందుకు ప్రభావిత ఫోన్ల డిస్ ప్లేపై జీవితకాల వారంటీని కంపెనీ అందిస్తోంది. ఇప్పుడు ఆ సంస్థ కొత్త ఆఫర్ తో ముందుకొచ్చింది.

వన్ ప్లస్ ఫ్రీ స్క్రీన్ అప్ గ్రేడ్
వన్ ప్లస్ రెడ్ కేబుల్ క్లబ్ రాయల్టీ ప్రోగ్రామ్ లో ఈ కొత్త ఆఫర్ కనిపించింది. ఈ ఆఫర్ కింద వన్ ప్లస్ 8టీ, వన్ ప్లస్ 8 ప్రో, వన్ ప్లస్ 9, వన్ ప్లస్ 9ఆర్ స్మార్ట్ ఫోన్ల యూజర్లు ఉచిత స్క్రీన్ రీప్లేస్మెంట్ పొందవచ్చు. వీటితో పాటు వారికి ఉచిత క్లీనింగ్, మెయింటెనెన్స్ సేవలు కూడా లభిస్తాయి. అయితే ఇందుకు కంపెనీ ఓ షరతు కూడా విధించింది. ఫ్రీ స్క్రీన్ రీప్లేస్ మెంట్ కోసం మీ ఫోన్ ఎటువంటి డ్యామేజ్ కాకూడదు. అలాగే, ఇది ఏ థర్డ్ పార్టీ సేవా కేంద్రంలోనూ తెరవద్దు. మీ ఫోన్ ఈ షరతులకు లోబడి ఉంటేనే ఉచిత స్క్రీన్ రీప్లేస్మెంట్ కు అర్హత సాధించవచ్చని సూచించింది.

మరింత మెరుగ్గా డిస్ ప్లే
నివేదికల ప్రకారం.. కంపెనీ ఈ ప్రోగ్రామ్ కింద అధునాతన డిస్ ప్లే ప్యానెల్ ను అందిస్తోంది. కొత్త స్క్రీన్ మెరుగైన పనితీరు. వైబ్రెంట్ కలర్, స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈ డిస్ ప్లేలు ఎక్కువ తేమ, అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రదేశాల్లో సైతం పని చేసేలా కంపెనీ రూపొందించింది. గ్రీన్ స్క్రీన్ సమస్య నుంచి ప్రజలను కాపాడేందుకు ఫ్రీ స్క్రీన్ రీప్లేస్ మెంట్ ప్రోగ్రామ్ ను వన్ ప్లస్ ప్రకటించింది. పాత అమోఎల్ఈడీ డిస్ ప్లేలపై ఈ సమస్య కనిపిస్తుంది. ముఖ్యంగా వన్ ప్లస్ ఫోన్లలో ఈ సమస్య బాగా ఎక్కువగా ఉంది. ఇప్పటికే పగిలిపోయిన ఫోన్లకు ఈ స్కీమ్ వర్తించదు.

వన్ ప్లస్ ఈ స్కీం ప్రకటించడంతో ఫోన్ ను వాడే వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ ఫోన్ లోని డిస్ ప్లే సమస్యను చాలా సార్లు కంపెనీతో మొరపెట్టుకున్నామని, కంపెనీ ప్రతినిధులు పట్టించుకోలేదని వాపోతున్నవారు ఉన్నారు. అయితే కంపెనీ రీసెంట్ గా ఈ నిర్ణయం తీసుకోవడంతో కొంత వెసులు బాటు కలిగిందని అంటున్నారు.