Moringa Leaves Benefits: మునగ ఆకుల రసాన్ని రోజూ తాగితే ఏమవుతుందో తెలుసా?

మునగ ఆకుల్లో క్యాల్షియం, ఐరన్, అమినో ఆసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే క్వెర్సెటిన్, క్లోరోజెనిక్ యాసిడ్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

Written By: Chai Muchhata, Updated On : December 9, 2023 6:27 pm

Moringa Leaves Benefits

Follow us on

Moringa Leaves Benefits: మునక్కాయ కూర అనగానే ఎవరైనా లొట్టలేసుకుని తింటారు. వీటి రుచి ఎంతో బాగుంటుంది. మునగకాయల్లో ఎన్నో విటమిన్లు ఉంటాయి. అయితే మునగ ఆకులతో కూడా అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. చాలా మందికి మునగకాయల గురించి మాత్రమే తెలుసు. కానీ మునగ ఆకుల్లో కూడా బోలెడు విటమిన్స్ ఉంటాయన్న విషయం తెలియదు. ఈ విషయం తెలియక మునగ ఆకుల గురించి పట్టించుకోవడం లేదు. మునగ ఆకులను రెగ్యులర్ గా తినడం వల్ల క్యాన్సర్, ఫ్రీ రాడికల్స్ ప్రభావం తగ్గుతుంది అని కొందరు వైద్యులు వెల్లడించారు. అలాగే కంటి చూపును పదును పెట్టడంలో ఇవి ఎంతో సహకరిస్తాయి. మరి మునగ ఆకును రోజూ తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

మునగ ఆకుల్లో క్యాల్షియం, ఐరన్, అమినో ఆసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే క్వెర్సెటిన్, క్లోరోజెనిక్ యాసిడ్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే ఏ విటమిన్ తో కళ్లకు చాలా మేలు. చాలా మందికి చిన్న వయసులోనే మృత కణాలు ఏర్పడుతాయి. వీటిని తొలగించే గుణం మునగ ఆకుల్లోనే ఎక్కువగా ఉంటుంది. ఇందులో అధిక మొత్తంలో పోటాషియం ఉంటుంది. దీంతో ఎముకలకు ఇది బలాన్ని ఇస్తుంది.

మునగ ఆకుల రసాన్ని లేదా పొడి చేసుకొని రెగ్యులర్ గా ఉదయం తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మునగ ఆకులను వేడి నీళ్లలో మరగబెట్టి కూడా కషాయం తాగవచ్చు. ఇలా ప్రతిరోజూ తీసుకోవడం వల్ల కడుపులో ఉండే మలినాలు తొలగిపోతాయి. జీర్ణక్రియ మెరుగుపడి ఆహారాన్ని త్వరగా జీర్ణం చేస్తుంది. కొలెస్ట్రాల్ అధికంగా ఉన్న వాళ్లు మునగ రసాన్ని తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఇది కాపాడుతుంది.

మునగ ఆకులతో శరీంలోని మలినాలనే కాకుండా చర్మ సంబంధిత వ్యాధులను నియంత్రిస్తుంది. అలాగే కంటి చూపు బాగుండడానికి ఇది ఎంతో ఉపకరిస్తుంది. కిడ్నీలో రాళ్లను కరిగించే గుణం మునగ ఆకుల్లో ఉందంటే ఎవరూ నమ్మరు. అందువల్ల మునగ చెట్టు ఎక్కడ కనిపించినా దాని కాయలు మాత్రమే కాకుండా ఆకులను తీసుకొచ్చి శుభ్రం చేసిన తరువాత పొడి చేయడం ద్వారా లేదా ఆకుల రసాన్ని తాగడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటారు.