Man Thinks About The Most: మానవజన్మ అదృష్టం అని కొందరు భావిస్తారు.. మరికొందరు ఈ జీవితం ఎందుకు పనికిరాదు.. అని ఎవరికి వారే నిందించుకుంటారు. వాస్తవానికి ఎవరి జీవితం వారిదే. ఒకరిపై ఒకరు ఆధారపడే పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ పనిచేస్తేనే కడుపు నిండే రోజులు వచ్చాయి. అయితే జీవనంలో మాత్రం తేడాలు ఉంటున్నాయి. కొందరు ఎక్కువ.. కొందరు తక్కువ డబ్బు సంపాదనతో మార్పులు కనిపిస్తున్నాయి. ఈ తేడాలు ఎందుకు ఉన్నాయి? అంటే ఎవరూ క్లారిటీగా చెప్పరు. ఎందుకంటే ఎవరికి అనుగుణంగా వారు చెప్పుకుంటారు. కానీ ఒకరి ఆలోచనలను మరొకరు ఏకీభవిస్తారా? అంటే.. అదికూడా చెప్పలేదు. అయితే మనిషి తన జీవితం నడవడానికి ఆలోచనే ప్రధానం. తన ఆలోచనను బట్టే తన జీవితం బాగుంటుందా? లేదా? అనేది చెప్పబడుతుంది. మనుషుల్లో ఎవరు ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తారు? ఎలా ఆలోచిస్తే జీవితం బాగుంటుంది.
ఇద్దరు వ్యక్తులు ఒక చోట కలిసినప్పుడు తమ కష్టాల గురించి చెప్పుకుంటారు. లేదా సంతోషాల గురించి మాట్లాడుకుంటారు. వీటిలో ఎక్కువగా జరిగినవి ఉంటాయి. లేదా భవిష్యత్ లో జరగబోయేవి ఉంటాయి. ఉదాహరణకు ఒక ఉద్యోగి తాను భవిష్యత్ లో బాగా బతకాలని ఎక్కువగా కష్టపడుతూ ఉంటాడు. భవిష్యత్ లో ప్రమోషన్, ఆదాయం పెరుగుతుందని కంపెనీని ఎంచుకుంటాడు. ఇదే సమయంలో గత కంపెనీల్లో ఉన్న అనుభవాన్ని బేరీజు వేసుకొని కంపెనిని నిర్ణయించుకుంటారు.
ఇదే ఒక వ్యాపారి తన వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని పెట్టుబడులు పెడుతారు. కొందరు గతంలో ఎలాంటి లాభాలు వచ్చేవి.. ఇప్పుడు ఏ విధంగా వస్తాయో.. అనే విషయాన్నిఆలోచిస్తాడు. అలాగే ఒక వ్యక్తి తన కుటుంబం గురించి ఆలోచించినప్పుడు భవిష్యత్ లో తమ లైఫ్ ఎలా ఉంటుందో అంచనా వేసుకొని అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటారు. ఇదే సమయంలో తమ ఇంట్లో ఉన్న పెద్దవారు వారికి ఎదురైన అనుభవాలను చెబుతూ ఉంటారు.
ఇలా చాలా మంది గతం గురించి, భవిష్యత్ గురించే ఎక్కువగా ఆలోచిస్తారు. వర్తమానంలో ఏం చేయాలి? అనే ఆలోచన ఉండదు. కేవలం వర్తమానం గురించి మాత్రమే ఆలోచించేవారికి ఎటువంటి ఇతర ఆలోచనలు ఉండవు. వారి పనికి ఎలాంటి ఆటంకాలు ఉండవు. ఈరోజు ఏం చేయాలి? అనే ప్లానింగ్ ద్వారా రోజూవారీ కార్యక్రమాలు నిర్వహించుకోవడం ద్వారా తన మనసు ప్రశాంతంగా ఉంటుంది. అనుకున్నపనిని ఇన్ టైంలో పూర్తి చేయగలడు. ఆరోజు నిర్ణయించుకున్న పనులన్నింటినీ పూర్తి చేయగలడు. కానీ ఒక్కసారి గతం గురించి గానీ.. భవిష్యత్ గురించి గానీ.. ఆలోచన మొదలైతే.. ఇక ఆ పని ముందుకు అస్సలు సాగదు.
ఇప్పటి వరకు.. ఇక నుంచి ఏ పని మొదలు పెట్టినా.. గతం, భవిష్యత్ గురించి ఆలోచించకుండా.. ఆ పని పూర్తయ్యే వరకు ఉండండి. ఆ పని కచ్చితంగా విజయవంతంగా పూర్తవుతుంది. అయితే ఈ పని రోజుల తరబడి ఉంటే.. ఈ సమయంలో ఎవరైనా? ఏదైనా విషయం చెప్పినా? ఆ పనిలో ఆటంకం కలగవచ్చు. అందువల్ల ఒక్కసారి సరైన నిర్ణయం తీసుకుంటే దానిని పూర్తి చేసేవరకు ఎలాంటి ఆలోచనలు చేయకుండా ఉండండి.