https://oktelugu.com/

America: శవాలను భద్రపరుస్తున్న అమెరికా కంపెనీ.. కారణం తెలిస్తే షాక్‌ అవుతారు!?

వైద్య రంగంలో సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీంతో అవయవ మార్పిడి కూడా సులభం అయింది. ఒకప్పుడు దీర్ఘకాలిక వ్యాధి వస్తే చావే శరణ్యం అనే పరిస్థితి. కానీ, దీర్ఘకాలిక వ్యాధులకు కూడా ఇప్పుడు చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి.

Written By:
  • Raj Shekar
  • , Updated On : December 3, 2024 / 03:49 PM IST

    America(6)

    Follow us on

    America: ప్రపంచంలో టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. విద్య, వైద్యం, బ్యాంకింగ్, బిజినెస్‌.. ఇలా ఏ రంగం చూసుకున్నా ఇప్పుడు టెక్నాలజీనే కనిపిస్తోంది. వ్యవసాయంలో కూడా టెక్నాలజీ వాడుతున్నారు. వైద్యరంగంలో అయితే ప్రాణాంతక వ్యాధులను నయం చేసే ప్రయోగాలు జరుగుతున్నాయి. కొన్ని అందుబాటులోకి వచ్చాయి. భవిష్యత్‌లో ముసలితనం కూడా చేసే వైద్యం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. చనిపోయిన మనిషని కూడా బతికించే టెక్నాలజీ వస్తుందని బలంగా నమ్ముతున్నారు.

    వైద్య రంగంలో సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీంతో అవయవ మార్పిడి కూడా సులభం అయింది. ఒకప్పుడు దీర్ఘకాలిక వ్యాధి వస్తే చావే శరణ్యం అనే పరిస్థితి. కానీ, దీర్ఘకాలిక వ్యాధులకు కూడా ఇప్పుడు చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. ఎలాన్‌ మస్క్‌కు చెందిన సంస్థ అయితే బ్రెయిన్‌లో చిప్‌ అమర్చే టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఇక రాబోయే రోజుల్లో చనిపోయిన మనిషిని కూడా బతికించే అవకాశం ఉందని నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికాకు చెందిన అల్కోర్‌లైఫ్‌ ఎక్స్‌ టెన్షన్‌ ఫౌండేషన్‌ అనే కంపెనీ టాప్‌ క్రయోనిక్స్‌ కంపెనీగా ఉంది. ఇది ప్రాణాలు పోయినవారిని బతికించే అవకాశం వస్తుందని శవాలను ప్రిజర్వు చేస్తుంది. వినేవారికి కొత్తగా అనిపించినా సాధ్యమే అంటున్నారు సైంటిస్టులు. ఆల్కోర్‌ సంస్థ ఇప్పటి వరకు 2233 మృతదేహాలను భద్రపర్చింది. వైద్య శాస్త్రం అభివృద్ధి చెందిన రోజున వీరిని తిరిగి బతికిస్తారనే ఆశలో ఉందట.

    క్రయోనిక్స్‌ అంటే..
    అల్కోర్‌ ఉపయోగించే శాస్త్రాన్ని క్రయోనిక్స్‌ అంటారు. ఈ ప్రక్రియలో మానవ శరీరాలను చాలా చల్లని తక్కువ ఉష్ణోగ్రతల వద్ద భద్రపరుస్తారు. భవిష్యత్‌లో మెడికల్‌ పీల్డ్‌ అభివృద్ధి చెందితే ఈ శరీరాలను మళ్లీ బతికించవచ్చని కంపెనీ భావిస్తోంది. అలాగే ఏ వ్యాధులతో మరణించినా చికిత్స అందించి ఎక్కువకాలం జీవించేలా టెక్నాలజీ అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. ఈ అడ్వాన్స్‌డ్‌ ప్రోసీజనర్‌ను విట్రిఫికేషన్‌ అంటారు. ఈ ప్రక్రియలో శరీరంలోని రక్తాన్ని మొదట క్రయోప్రొటెక్టెంట్‌ అనే ద్రావణంతో రీస్లేస్‌ చేస్తారు. చల్లదనం కారణంగా లోపల మంచు స్పటికాలు ఏర్పడకుండా ఇది కాపాడుతుంది. విట్రిఫికేషన్‌ పూర్తయిన తర్వాత శరీరాన్ని నెమ్మదిగా 196 డిగ్రీల సెల్సియస్‌ వద్ద నిల్వ చేస్తారు. లిక్విడ్‌ నైట్రోజన్‌తో నిండిన వాక్యూమ్‌ ఇన్సులేటెడ్‌ మెటల్‌ కంటైనర్‌లో నిల్వ చేస్తారు.

    ఇది సాధ్యమేనా?
    భవిష్యత్‌లో వైద్య శాస్త్రం ఎంత అభివృద్ధి చెందినా చనిపోయినవారిని తిరిగి బతికించడం సాధ్యమవుతుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి మరనానికి కారణమైన వ్యాధులను అయినా నయం చేయగలమా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. భవిష్యత్‌లో నానో టెక్నాలజీ, రివైవల్‌ మెడికల్‌ టెన్నాలజీ ద్వారా ఇది సాధ్యమయ్యే అవకాశం ఉందంటోంది ఆల్కోర్‌ కంపెనీ. క్రియోప్రిజర్వేషన్‌ తో కలిగే నష్టాన్ని కూడా రిపేర్‌ చేయగ స్థాయికి మెడికల్‌ టెక్నాలజీ అభివృద్ధి చెందుతుందని చెబుతున్నారు.

    ప్రిజర్వు కోసం చార్జి..
    క్రియోప్రెజర్వేషన్‌ కోసం మెంబర్‌షిప్‌ తీసుకున్నవారి డబ్బులో ఒక భాగం ఈ ట్రస్ట్‌ ఫండ్‌కు వెళ్తుంది. ఫుల్‌ బాడీ ప్రిజర్వేషన్‌కు 1,15,000 డాలర్ల(భారత కరెన్సీలో రూ.96 లక్షలు) ఈ ట్రస్టుకు చెల్లిస్తారు. కేవలం మెదడు మాత్రమే ప్రిజర్వు చేయానికి న్యూరో ప్రిజర్వేషన్‌కు 25,000 డాలర్లు(సుమారు రూ.21 లక్షలు) చెల్లించాలి. ఇక వయసును బట్టి ప్రతీనెల 16 నుంచి 100 డాలర్లు సబ్‌స్క్రిప్షన్‌ ఫీజుచెల్లించాలి.