https://oktelugu.com/

Kakinada Collector: ఆ షిప్ సంగతి తేల్చేందుకు కమిటీ.. సీరియస్ యాక్షన్ లోకి పవన్

పవన్ సీరియస్ యాక్షన్ లోకి దిగారు.కాకినాడ పోర్టులో పట్టుబడిన రేషన్ బియ్యం పై మంత్రివర్గ సహచరులకు వివరించారు.అదే సమయంలో కాకినాడ జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన విడుదల చేశారు.

Written By:
  • Dharma
  • , Updated On : December 3, 2024 / 03:43 PM IST

    Kakinada Collector

    Follow us on

    Kakinada Collector: కాకినాడ పోర్టు ద్వారా రవాణా అవుతున్న బియ్యం విషయంలో కూటమి ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టింది. కొద్దిరోజుల కిందట సౌత్ ఆఫ్రికా కు ఒక షిప్ లో తరలుతున్న 35 వేల టన్నుల రేషన్ బియ్యాన్ని అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే.కాకినాడ జిల్లాకు చెందిన కలెక్టర్, ఎస్పీ ఆ బియ్యాన్ని తనిఖీ చేసి..అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు.సీజ్ కూడా చేశారు.ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ షిప్ తో పాటు బియ్యాన్ని పరిశీలించారు. ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. అయితే అది విదేశీ షిప్ కావడంతో ఎటువంటి చర్యలకు దిగలేదు ఏపీ సర్కార్. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ప్రత్యేకంగా లేఖ రాశారు. సీఎం చంద్రబాబుకు సైతం పూర్తిస్థాయిలో నివేదించారు. ఈ పరిస్థితుల్లో ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇదే హాట్ టాపిక్ అయ్యింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రేషన్ బియ్యం దందాకు చెక్ చెప్పాలని మంత్రివర్గంలో తీర్మానించారు. అందులో భాగంగా నిజాలు నిగ్గు తేల్చేందుకు అత్యున్నత స్థాయి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీని కాకినాడ జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా ప్రకటించడం విశేషం.

    * కమిటీ ప్రకటన
    రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో కాకినాడ జిల్లా కలెక్టర్ ప్రత్యేక ప్రకటన జారీ చేశారు. ఐదు శాఖలతో కూడిన మల్టీ డిసిప్లినరీ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో పోర్టుతో పాటు రెవెన్యూ, పోలీస్, సివిల్ సప్లై, కస్టమ్స్ అధికారులతో కూడిన ఒక కమిటీని దర్యాప్తు కోసం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా పై దర్యాప్తు చేస్తున్నామని.. గోడౌన్స్ నుంచి షిప్ వరకు బియ్యం ఎలా తరలించారో తేలుస్తున్నామని కలెక్టర్ ప్రకటించారు. కాకినాడ పోర్టులో ఓడలను తనిఖీ చేసి అధికారం తమకు ఉందని కూడా కలెక్టర్ వెల్లడించారు. ప్రస్తుతం పట్టుబడిన షిప్ పోర్టు ఆఫీసర్ కస్టడీలో ఉన్నట్లు తెలిపారు.

    * సీరియస్ గా చర్చ
    మరోవైపు రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ పట్టుబడిన బియ్యం పై సీరియస్ గా చర్చ నడుస్తోంది. ఈ బియ్యం దందా వెనుక ఉన్నది ఎవరు? అందులో రాజకీయ హస్తం? అధికారుల ప్రమేయం వంటి వాటిపై పవన్ సమగ్రంగా వివరిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రస్థాయిలోరేషన్ బియ్యం పక్కదారిపై పటిష్ట చర్యలు చేపట్టేందుకు ఉన్న మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తున్నట్లు సమాచారం.