Loneliness: ఒంటరితనాన్ని దూరం చేసే ఈ 5 చిట్కాల గురించి తెలుసా?

ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి ఒక్కరూ చేయాల్సిన పని నడవడం. ప్రతిరోజూ ఉదయం వాకింగ్ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మైండ్ రిఫ్రేష్ కావడానికి కనీసం 100 అడుగులు వేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Written By: Raj Shekar, Updated On : December 5, 2023 2:29 pm

Loneliness

Follow us on

Loneliness: సమాజంలో జీవించే ప్రతీ వ్యక్తి మరో వ్యక్తితో ఏదో రకమైన సంబంధాన్ని కలిగి ఉంటారు. ఒంటరిగా ఎవరూ ఉండలేరు. కానీ కొన్ని కారణాల వల్ల..సమాజంలోని కొన్ని పరిస్థితుల వల్ల ఇతరులతో ఎక్కువగా కలిసి ఉండడానికి ఇష్టపడరు. ఒంటరిగా ఉండడానికే మొగ్గు చూపుతారు. కానీ ఇది రాను రాను తీవ్ర మానసిక వేదనకు గురిచేస్తుంది. ఒంటరిగా ఉండడం వల్ల నెగెటివ్ ఆలోచనలు వస్తాయి. దీంతో చేయరాని పనులు చేయాలని అనిపిస్తుంది. దీంతో జీవితం చిందరవందరగా మారుతుంది. అయితే చాలా మందికి బంధువులు, స్నేహితులు ఎంతో మంది ఉన్నా వారి మనసులో ఏదో తెలియని లోపం ఉంటుంది. తమ చుట్టూ ఎంతో మంది ఉన్నా తాము ఓంటరివారమే అన్న ఫీలింగ్ ఉంటుంది. ఇలాంటి ఫీలింగ్ పోవడానికి మానసిక నిపుణులు కొన్ని చిట్కాలు చెప్పారు. అవేంటో చూద్దాం..

నడక:
ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి ఒక్కరూ చేయాల్సిన పని నడవడం. ప్రతిరోజూ ఉదయం వాకింగ్ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మైండ్ రిఫ్రేష్ కావడానికి కనీసం 100 అడుగులు వేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అలాగే ఒంటరితనం గా ఫీలయ్యేవారు వాకింగ్ ను అలవాటు చేసుకోవడం వల్ల వారిలో ఉన్న నెగెటివ్ ఫీలింగ్ పోతుంది. దీంతో మానసికంగా ఉల్లాసంగా ఉంటారు.

మ్యూజిక్:
సంగీతంతో మనసు ఉల్లాసంగా మారుతుంది. అయితే ఇష్టమైన మ్యూజిక్ వినడం వల్ల ఎంతో హాయిగా ఉంటుంది. ఖాళీ సమయాల్లో లేదా వాకింగ్ చేస్తున్న సమయంలో ఇష్టమైన సంగీతం వినడం వల్ల ఉల్లాసంగా ఉంటారు. దీంతో ఒంటిరతనం అన్న భావనం తొలిగిపోయి ప్రశాంతంగా ఉంటారు. అంతువల్ల సమయం దొరికినప్పుడల్లా సంగీతం వినడానికి ప్రయత్నించండి.

కమ్యూనికేషన్:
చాలా మందికి స్నేహితులు, బంధువులు ఎంతో మంది ఉంటారు. కానీ వారితో మాట్లాడడానికి ఇష్టపడరు. కానీ అప్పడప్పుడ స్నేహితులతో సరదాగా కబుర్లు చెప్పడం అలవాటు చేసుకోవాలి. వీలైతే వారిని నేరుగా కలిసి ఏదో విషయంపై మాట్లాడుతూ ఉండాలి. అలాగే ఫంక్షన్లు, ప్రత్యేక కార్యక్రమాలకు ఆహ్వానం అందితే తప్పకుండా వెళ్లాలి. ఇలా చేయడం వల్ల పని ఒత్తిడి నుంచి రిలాక్స్ అయి నెగెటివ్ ఫీలింగ్ పోతుంది.

నచ్చిన పని చేయడం:
కొన్ని పనులు చేయడం అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. చెట్లకు నీరు పోయడం.. ఇతరులకు సాయం చేయడం.. గేమ్స్ ఆడడం.. వంటివి వారి మనసుకు ఉత్తేజాన్ని ఇస్తాయి. సమయం దొరికినప్పుడల్లా ఇలాంటివి చేయడం వల్ల ప్రెషర్ నుంచి రిలీఫ్ అవుతారు. అప్పుడు ఒంటరిగా ఉన్నామనే భావన తొలిగిపోతుంది.

జంతువులతో..
పెంపుడు జంతువులో చాలా మంది ఎంతో ఉల్లాసంగా ఉంటారు. ఇవి కల్మషం లేని విశ్వాసాన్ని పంచుతాయని వారి నమ్మకం. అటువంటప్పుడు ఇష్టమైన జంతువులను పెంచుకొని వాటితో గడపడం ద్వారా ఎటువంటి చెడు ఆలోచనలు రాకుండా ఉంటాయి. సమయం దొరికినప్పుడల్లా వాటిని తీసుకొని అలా బయటకు వెళ్లడం ద్వారా మనసు ఉల్లాసంగా మారుతుంది.