Hero Nani: ఒకప్పుడు నితిన్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్.. ఇప్పుడు నితిన్ ను మించిన ఆ హీరో ఎవరో తెలుసా?

ప్రస్తుతం హాయ్ నాన్న అనే సినిమాతో ప్రేక్షకుల మదిని దోచుకునేందుకు సిద్ధం అయ్యారు. ఇందులో భాగంగా సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచిన నాని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం గురించి పలు కీలక విషయాలను బయటపెట్టారు.

Written By: Suresh, Updated On : December 5, 2023 3:47 pm

Hero Nani

Follow us on

Hero Nani: నాచురల్ స్టార్ నాని.. తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. హీరో కాకముందు నుంచే ఆయన సినీ ప్రస్థానం మొదలైందన్న సంగతి దాదాపు ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అసిస్టెంట్ డైరెక్టర్ గా పలు చిత్రాలు చేసిన నాని ఆ తరువాత హీరోగా మారారు. ప్రస్తుతం హాయ్ నాన్న అనే సినిమాతో ప్రేక్షకుల మదిని దోచుకునేందుకు సిద్ధం అయ్యారు. ఇందులో భాగంగా సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచిన నాని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం గురించి పలు కీలక విషయాలను బయటపెట్టారు.

సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో శ్రీకాంత్, నితిన్ వంటి పలువురు హీరోలకు నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారట. ఈ క్రమంలోనే ప్రముఖ దర్శకులు రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో నితిన్ కథనాయకుడిగా వచ్చిన చిత్రం ‘అల్లరి బుల్లోడు’. ఈ మూవీకి సహాయ దర్శకుడిగా ఉన్న నాని… నితిన్ తో స్నేహం చేశారట. ఈ విషయాన్ని స్వయంగా నాని ఓ ఇంటర్వ్యూలో భాగంగా వెల్లడించారు. హీరోలందరినీ బాబు అని పిలిచినప్పటికీ నితిన్ ను మాత్రం పేరు పెట్టే పిలిచేవారట. ప్రొడ్యూసర్ బాబు అని పిలవాలని చెప్పినప్పటికీ నితిన్ మాత్రం తనను పేరు పెట్టి పిలవాలని చెప్పారట.. వారి మధ్య స్నేహం ఎప్పటి నుంచో ఉందని నాని తెలిపారు.

అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరోగా మారిన నాని వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. అష్టాచెమ్మా మొదలు మొన్న వచ్చిన దసరా సినిమా వరకు ఎన్నో హిట్ సినిమాలు చేశారు..తాజాగా ‘హాయ్ నాన్న’ తో అభిమానుల ముందుకు రానున్నారు. దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో నాని హీరోగా నటించగా హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ కనిపించనున్నారు. కాగా ఈ సినిమా ఈనెల 7వ తేదీన విడుదలకు సిద్ధమైంది.