Heart Attack Signs: ప్రస్తుత కాలంలో రోగాలు విస్తరిస్తున్నాయి. మనం తీసుకునే ఆహారాలే మనకు ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. మన దేశంలో గుండె జబ్బుల ముప్పు ఎక్కువగానే ఉంటోంది. దీనికి కారణాలు కూడా లేకపోలేదు. మనం తినే ఆహారాలతో వృద్ధాప్యంలో రావాల్సిన గుండె జబ్బులు పాతికేళ్లకే వస్తున్నాయి. దీంతో అర్థంతరంగా ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే గుండె పోటు ఎందుకు వస్తుంది? ఎలా వస్తుంది? దాని సంకేతాలేమిటి? అనే విషయాలపై ముందస్తు కొన్ని సంకేతాలు మనకు కనిపిస్తాయి. వాటిని ఎవరు పట్టించుకోరు. తీరా జరగాల్సిన నష్టం జరుగుతుంది. ప్రాణాలు గాల్లో కలిసిపోయాక ఆలోచిస్తే ఏం లాభం. ముందే గ్రహించుకుని వైద్యం చేయించుకుంటే సరి.

మన గుండె పనితీరుపై మనకు అప్పుడప్పుడు సంకేతాలు వస్తే వాటిని లెక్కలోకి తీసుకోవాలి. మనకు తరచుగా అజీర్ణం సమస్య అనిపిస్తే జాగ్రత్త వహించాలి. గుండె జబ్బులకు మూలం ఇది ప్రథమ సంకేతంగా భావించాలి. అజీర్ణం వల్ల కడుపులో మంట, చాతీలో మంటగా అనిపిస్తే గుండెకు సంబంధించిన సమస్యగా గుర్తుంచుకోవాలి. గుండెపోటు వచ్చే సమయంలో చాతీలో నొప్పి ఇతర భాగాలకు కూడా వ్యాపిస్తుంది. చాతిలో బారం, అదనపు ఒత్తిడి ఎక్కువగా గుండెపోటుకు చెందిన సూచనగా తెలుసుకోవాలి.
గుండెపోటు వస్తుందని చెప్పే సంకేతాల్లో వికారం, కడుపు ఉబ్బరం మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అప్పుడు కడుపులో అసౌకర్యంగా ఉంటుంది. చాతిలో నొప్పి వచ్చి వచ్చి వికారంగా అనిపిస్తుంది. ఇది గుండె జబ్బుకు సంకేతంగా చెప్పుకోవచ్చు. పొత్తికడుపులో ఉబ్బరంగా అనిపిస్తుంది. గ్యాస్ సమస్యగా అనుకుంటే పొరపాటు పడినట్లే. నీరసం, బలహీనంగా అనిపిస్తే కూడా తేలిగ్గా తీసుకోవద్దు. శరీరంలో రక్తప్రసరణ సరిగా జరగకపోతే ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆ సమయంలో కచ్చితంగా వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి.

నడుస్తున్నప్పుడు మోకాలి వెనుక భాగంలో, పాదాల్లో నొప్పి వస్తుంటే అజాగ్రత్తగా ఉండొద్దు. వ్యాయామం చేసేటప్పుడు కూడా నొప్పి వస్తే కూడా అప్రమత్తం అవ్వాలి. తక్షణమే వైద్యులను సంప్రదించాలి. ఇలా గుండె జబ్బులు వచ్చే సంకేతాలు వచ్చినప్పుడు చికిత్స తీసుకుంటేనే మనకు ప్రాణాలకు ముప్పు వాటిల్లదు. అంతేకాని అదే పోతుందిలే అనే నిర్లక్ష్యం వద్దు. తగిన సమయంలో చికిత్స తీసుకుని మన ప్రాణాలు కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.