Bamboo Plant Vastu: మనం వాస్తు శాస్త్రాన్ని నమ్ముతాం. ప్రతిది వాస్తు పద్ధతిలో ఉండాలని చూసుకుంటాం. సంపద కావాలని కోరుకుంటాం. ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేసుకోవాలని తాపత్రయపడతాం. ఇందులో భాగంగానే ఇంటలో ఎలాంటి వాస్తు తప్పులు లేకుండా చూసుకుంటాం. ఇందుకోసం కొన్ని పరిహారాలు కూడా పాటిస్తుంటాం. ఇందులో ఇంట్లో వెదురు మొక్క పెంచుకుంటే మంచి ఫలితాలు వస్తాయని చెబుతారు.
వెదురు మొక్కను లక్కీ జేంబూగా పిలుస్తారు. ఇంట్లో ఏ దిక్కున నాటుకోవాలి. ఇంటి ఆవరణలో వెదురు మొక్కను పెంచుకోవడం వల్ల అదృష్టం వరిస్తుందని అంటారు. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ రావడానికి ఇది దోహదపడుతుంది. ఎప్పుడు పచ్చగా ఉండే ఈ మొక్క ఇంటి ఆవరణలో ఉంటే అంతా క్షేమమే. వెదురు మొక్క ఇంట్లో ఉండటం వల్ల మనకు లాభాలు కలుగుతాయి.
వెదురు మొక్కకు ధర ఎక్కువగానే ఉంది. నర్సరీల్లో దీని ధర రూ. 200 నుంచి 2000 వరకు ఉంది. చిన్న వెదురు మొక్క అయినా మూడు నాలుగు అడుగుల ఎత్తు అందమైన మొక్క అయినా అందుబాటులో ఉన్నవి తీసుకుని పెంచుకుంటే మంచిది. ఇది గాజు కుండీలో పెట్టుకుంటే మరింత అందంగా కనిపిస్తుంది.
వెదురు మొక్కను జాగ్రత్తగా కాపాడుకోవాలి. దీనికి నీరు అవసరం ఉండదు. ఒకవేళ నీళ్లు ఎక్కువైతే కుళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. వాతావరణానికి అనుకూలంగా మార్పులు చేసుకుంటే మంచిది. ఎరువు వేయాలి. సూర్యకాంతి తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మొక్క ఎండిపోకుండా చూసుకోవాలి. అలా వెదురు మొక్కను కాపాడుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.
వెదురుమొక్క పంచభూతాలకు ప్రతీకగా చెబుతారు. దీన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఇంట్లో దీన్ని పెంచుకోవడం వల్ల అనుకూల ఫలితాలు వస్తాయని నమ్ముకోవాలి. ఇంట్లో ప్రేమాభిమానాలు పెరుగుతాయి. ఆర్థిక సమస్యలు తొలగిపోయేందుకు అవసరమైన మార్గాలు వస్తాయి.