Hanuman Sindhuram Benefits: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఆంజనేయ స్వామిని కూడా ఎంతో పరమ పవిత్రమైన దేవుడిగా పూజిస్తాము. ఇక ఆంజనేయస్వామికి సింధూరం అంటే ఎంత ప్రీతికరము మనందరికీ తెలిసిందే. ఇలా స్వామి వారికి ఎంతో ఇష్టమైన సింధూరం పెట్టుకోవటం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. మరి సింధూరం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయానికి వస్తే….
సింధూరం నుదిటిపై పెట్టుకోవటం వల్ల మనలో ఎంతో ధైర్యం వస్తుంది. ఎలాంటి పనినైనా ఎంతో సునాయాసంగా చేయగలము. అదేవిధంగా చాలామంది రాత్రిపూట పీడకలతో బాధపడుతూ ఉంటారు. ఇలా పీడ కలలకు భయభ్రాంతులు అయ్యేవారు నుదుటిన సింధూరం పెట్టుకోవడం వల్ల ఎలాంటి పీడకలలు దరిచేరవు. ఇక చిన్న పిల్లలకు బాలగ్రహ దోషాలు ఉంటే అలాంటి వారికి సింధూరం పెట్టడం వల్ల ఎలాంటి దోషాలు ఉండవు.
Also Read: నిస్సారమైన బడ్జెట్ పై ప్రశంసాలా?
ఇంట్లో నిత్యం కలహాలు గొడవలు జరుగుతూ ఉంటే అలాంటివారు సింధూరం పెట్టుకోవడం వల్ల వారి మధ్య కలహాలు దూరమవుతాయి. ఇక భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా పెరుగుతుంది. పిల్లలు లేనివారు పిల్లల కోసం స్వామివారి సింధూరం ధరించి స్వామి వారిని పూజించడం వల్ల సంతాన భాగ్యం కలుగుతుంది.ఇక పరీక్షల సమయంలో భయంతో ఉండే విద్యార్థులు స్వామి వారి ఆలయానికి వెళ్లి సింధూరం పెట్టుకుంటే ఎలాంటి భయాందోళనలు లేకుండా పరీక్షలలో విజయం సాధిస్తారు. గ్రహ బాధలతో బాధపడే వారు నిత్యం సింధూరం ధరించడం వల్ల గ్రహ బాధల నుంచి విముక్తి పొందుతారు.
Also Read: ఏపీలోనూ ఆస్తుల విలువ పెంపు.. అప్పటి నుంచి అమలులోకి..