Alia Bhatt: ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ – స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో రానున్న పాన్ ఇండియా సినిమా గురించి లేటెస్ట్ అప్ డేట్ వినిపించింది. నిజానికి ఈ సినిమా ఎనౌన్స్ చేసినప్పటి నుండి.. ఎన్టీఆర్ సరసన ఫలానా స్టార్ హీరోయిన్ అయితే బాగుంటుంది. లేదు, ఫలానా హీరోయిన్ ను ఆల్ రెడీ హీరోయిన్ గా ఫిక్స్ అయింది అంటూ, ఇలా అనేక రకాలుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి.

అయితే తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ఫిక్స్ అయింది. నిజంగానే మేకర్స్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.ఇప్పటికే అగ్రిమెంట్ కూడా పూర్తి అయిందట, మరి ఆ హీరోయిన్ ఎవరు అంటే.. బాలీవుడ్ క్రేజీ బ్యూటీ ‘అలియా భట్’. త్వరలోనే ఈ వార్త పై అధికారిక ప్రకటన రానుంది. అయితే, ఈ సినిమా గురించి హీరోయిన్ ఆలియా భట్ ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘ఎన్టీఆర్ 30 కోసం నన్ను సంప్రదించారు.
Also Read: ఉద్యోగులతో వైరం.. జగన్ కు మంచికా? చెడుకా?
ఆల్ రెడీ కొరటాల శివ స్టోరీ కూడా చెప్పారు. నేను మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పాను. మా కాంబినేషన్ వర్కవుట్ అవుతుందని అనుకుంటున్నాను. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ తో కలిసి నటించడం కోసం ఎదురుచూస్తున్నాను’ అని చెప్పింది. ఇందులో తారక్ స్టూడెంట్ లీడర్‌గా కనిపించనున్నాడని టాక్. అనిరుధ్ సంగీతం అందించనున్నాడు.

ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో మూడు వేరియేషన్స్ ఉంటాయని, ఎన్టీఆర్ సినిమాలో మొత్తంగా మూడు గెటప్స్ లో కనిపిస్తాడని తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.
Also Read: కేసీఆర్ కు అప్పుడే ఎన్నికల జ్వరం ఎందుకు?