Relationship: రెగ్యులర్ గా శృంగారంలో పాల్గొంటే ఉండే ప్రయోజనాలేవో తెలుసా?

శృంగారం జీవితంలో ప్రధానమైన ఘట్టం. వయసులోకి వచ్చిన ప్రతి ఒక్కరూ దీనిని కోరుకుంటారు. కానీ ఆరోగ్యకరమైన శృంగారం ఇద్దరు వ్యక్తులకు అధిక తృప్తినిస్తుంది. అయితే ప్రస్తుత కాలంలో శృంగారం లో పాల్గొనడానికి సమయం ఉండడం లేదు. ఉద్యోగం, వ్యాపారం నిమిత్తం బిజీగా ఉండడంతో పాటు కొన్ని కారణాల వల్ల శృంగారానికి దూరంగా ఉంటున్నారు. దీంతో అడపాదడపా శృంగారంతో భాగస్వాములిద్దరి మధ్య దూరం పెరుగుతుంది, ప్రేమాభిమానాలు తగ్గుతాయి.

Written By: Srinivas, Updated On : October 30, 2024 12:44 pm

Relationship:

Follow us on

Relationship:  శృంగారం జీవితంలో ప్రధానమైన ఘట్టం. వయసులోకి వచ్చిన ప్రతి ఒక్కరూ దీనిని కోరుకుంటారు. కానీ ఆరోగ్యకరమైన శృంగారం ఇద్దరు వ్యక్తులకు అధిక తృప్తినిస్తుంది. అయితే ప్రస్తుత కాలంలో శృంగారం లో పాల్గొనడానికి సమయం ఉండడం లేదు. ఉద్యోగం, వ్యాపారం నిమిత్తం బిజీగా ఉండడంతో పాటు కొన్ని కారణాల వల్ల శృంగారానికి దూరంగా ఉంటున్నారు. దీంతో అడపాదడపా శృంగారంతో భాగస్వాములిద్దరి మధ్య దూరం పెరుగుతుంది, ప్రేమాభిమానాలు తగ్గుతాయి. ఒకరిపై ఒకరికి నమ్మకం పోతుంది. ఈ నేపథ్యంలో రెగ్యులర్ గా శృంగారంలో పాల్గొనాలని మానసిక వైద్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే క్రమం తప్పకుండా ఈ కార్యంలో పాల్గొంటే కొన్ని లాభాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వివరాల్లోకి వెళ్లండి..

శృంగారంలో పాల్గొన్న క్షణాలు అద్భుతంగా అనిపిస్తాయి. అంతేకాకుండా శృంగారంలో పాల్గొన్న సమయంలో శరీరం మొత్తం కదలిక ఉంటుంది. ఇందులో మెదడు కూడా పనిచేస్తుంది. ఈక్రమంలో రక్త ప్రసరణ వేగం పెరుగుతంది. దీంతో ఆరోగ్యంగా ఉండగలుగుతారు. క్రమం తప్పకుండా శృంగారంలో పాల్గొనడం వల్ల నిత్యం యాక్టివ్ ఉంటారు. ఎలాంటి ప్రతికూల శక్తిని తట్టుకోవడానికైనా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శృంగారం అనేది శరీరానికి సంబంధించి మాత్రమే కాదు. మనసు ప్రశాంతంగా ఉన్న సమయంలోనే చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదో తెలియని ఫీలింగ్స్ ఉంటాయి. దీంతో ఒక్కోసారి ఎమోషనల్ అయి గుండె వేగంగా కొట్టుకుటుంది.

ప్రస్తుత కాలంలో చాలా మంది పనులు, ఇతర కారణాల వల్ల ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య నుంచి బయటపడడానికి మిగతా సాధనాల కన్నా శృంగారంలో పాల్గొనడం చాలా బెటర్. అయితే రెగ్యులర్ గా శృంగారంలో పాల్గొనడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. దీంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాకుండా ఒత్తిడి నుంచి ప్రశాంతమైన మూడ్ లోకి వస్తారు. వారానికి మూడు రోజుల పాటు శృంగారంలో పాల్గొంటే ఆ వీక్ మొత్తం ప్రశాంతంగా ఉంటారు.

కొందరికి లైంగిక క్రియలో పాల్గొనాలని ఉత్సాహంగా ఉంటారు. కానీ అవసరమైన మూడ్ రాదు. అయితే రెగ్యులర్ గా ఈ పని చేయడం వల్ల ఇదే ధ్యాసలో ఉండగలుగుతారు. ఒకసారి జరిగే క్రియ సక్సెస్ అయితే మరోసారి చేయాలని మూడ్ వస్తుంది. ఇలా రెగ్యులర్ గా చేయడానికి శరీరంలో అదనపు శక్తి వస్తుంది. వయసు పెరిగే కొద్ది బోన్స్ అరిగిపోతాయి. దీంతో కొన్నినొప్పులు వస్తుంటాయి.అయితే శృంగారంలో పాల్గొనడం వల్ల నొప్పుల నుంచి దూరంగా ఉండగలుగుతారు. శృంగారంలో పాల్గొనడం వల్ల కండరాల్లో కదలిక ఉంటుంది. దీంతో శరీరం ఉల్లాసంగా మారుతంది.

భాగస్వాములిద్దరూ రెగ్యులర్ గా శృంగారంలో పాల్గొనడం వల్ల వీరి మధ్య బంధత్వం బలపడుతుంది. దీంతో ఒకరి గురించి మరొకరు అర్థం చేసుకోగలుగుతారు. ఈ క్రమంలో చిన్న చిన్న తప్పులు ఉన్నా.. వాటిని అధిగమించి ముందుకు కదులుదారు. దీంతో ఇద్దరూ చాలా కాలం పాటు సంతోషంగా ఉంటారు. శృంగారం కూడా ఒక వ్యాయామ లాంటిదే ఈ క్రియలో పాల్గొన్న వారి శరీరం మొత్త పని చేస్తుంది. అయితే ఒక సమయం ప్రకారం చేయడం వల్ల వ్యాయామం చేసినట్లవుతుంది.