Homeహెల్త్‌Teeth green : దంతాలు పచ్చగా ఉన్నాయా? జస్ట్ అరటి తొక్క చాలు

Teeth green : దంతాలు పచ్చగా ఉన్నాయా? జస్ట్ అరటి తొక్క చాలు

Teeth green : ఎన్ని పేస్టులు మార్చినా, ఎంత సేపు పండ్లు తోమినా సరే దంతాలు తెల్లగా మారడం లేదా? కానీ ఒక చిన్న పండుతో మీ పచ్చని పళ్లను తెల్లగా మెరిసేలా చేసుకోవచ్చు. కేవలం అరటి తొక్కతో పచ్చని పళ్లను తెల్లగా చేసుకోవచ్చు. అదెలా అనుకుంటున్నారా? అయితే ఇప్పుడు తెలుసుకుందాం. అయితే చాలా మంది అరటిపండును తినేసి దాని తొక్కను పనికిరాదని డస్ట్ బిన్ లో పడేస్తుంటారు కదా. కానీ అరటి తొక్క కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అరటి తొక్కలో మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి.

ఇవి పళ్లను తెల్లగా చేస్తాయి. ఒక్క అరటితొక్కను మాత్రమే కాదు దానితో బేకింగ్ సోడాను కలిపి పెడితే మరింత మంచి ఫలితాలు ఉంటాయి. పచ్చని పళ్లను తెల్లగా చేయడానికి ముందుగా.. అరటి తొక్కను తీసుకుని దాని లోపలి తెల్లని భాగాన్ని దంతాల మీద బాగా రుద్దాలి. తొక్కను పై నుంచి కిందకి వృత్తాకారంలో రుద్దితే దానిలో ఉండే పోషకాలు దంతాలకు అంటుతాయి. ఆ తర్వాత  ఒక చెంచా బేకింగ్ సోడాను తీసుకుని.. దానికి కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు అరటి తొక్కతో బేకింగ్ సోడా పేస్ట్ ను కలిపి దంతాలకు రాస్తే సరిపోతుంది. ఆ తర్వాత దంతాలను క్లీన్ చేసుకోవాలి.

అరటి తొక్కలో ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ఇది దంతాల ఉపరితలాన్ని చేరి పసుపు రంగును పోగొట్టడానికి సహాయం చేస్తుంది. అలాగే బేకింగ్ సోడా నేచురల్ స్క్రబ్బర్‌గా పనిచేస్తుంది అంటున్నారు నిపుణులు. పళ్లపై పొరలోని మచ్చలను పోగొట్టడానికి సహాయపడుతుంది. అంతేకాదు బేకింగ్ సోడాలోని ఆల్కలీన్ లక్షణాలు దంతాల పసుపు రంగును తగ్గించడానికి సహాయపడతాయి. ఈ చిట్కాలను ఫాలో అవ్వడం మాత్రమే కాదు దంతాలను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవడం మర్చిపోవద్దు. రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకోవడం మంచిది. మరీ ముఖ్యంగా  టీ, కాఫీ, సిగరెట్లు ఎక్కువగా తాగడం మానేయండి. ఎందుకంటే ఇవి మీ పళ్లను పసుపు రంగులోకి మార్చేస్తుంటాయి. అలాగే దంతాలు తెల్లగా ఉండేందుకు కనీసం 6 నెలలకోసారైనా దంత వైద్యుడి దగ్గరకు వెళ్లడం మర్చిపోవద్దు.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

Vaibhav Suryavanshi : బుడ్డోడి కొట్టుడుకి.. బంతి స్టేడియం అవతల.. పెద్ది సినిమా చూపించాడు గా

Vaibhav Suryavanshi :  49 బంతులు.. ఇందులో 8 ఫోర్లు.. నాలుగు సిక్సర్లు.. మొత్తంగా 81 పరుగులు.. అభిషేక్ శర్మతో తొలి వికెట్ కు 20 పరుగులు.. ఇషాన్ కిషన్ తో రెండో వికెట్...

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....
Oktelugu Epaper
Exit mobile version