
Get Rid of Gas, Acidity and Constipation: ప్రస్తుత కాలంలో అనారోగ్య సమస్యలు అందరిని వెంటాడుతున్నాయి. ఇందులో గ్యాస్, ఎసిడిటి, మలబద్ధకం వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారు. కడుపులో అజీర్తి సమస్యలు అందరిని భయపెడుతున్నాయి. గ్యాస్ సమస్యలను దూరం చేసుకోవడానికి సహజమైన పండ్లు తీసుకుంటే ఎంతో మంచిది. పండ్లు తినడం వల్ల మలబద్ధకం దూరమవుతుంది. ఎసిడిటి, మలబద్ధకం వంటివి ఎంతో వేదనకు గురి చేస్తున్నాయి.
కడుపులో గ్యాస్ సమస్య ఉన్నట్లయితే ఉబ్బరంగా అనిపిస్తుంది. కడుపు ఉబ్బరం అజీర్తి సమస్యలతో బాధపడుతున్నప్పుడు నీళ్లు తాగడం వల్ల ఎంత ఉపశమనం లభిస్తుంది. గ్యాస్ సమస్యను దూరం చేసుకోవడానికి కొన్ని చిట్కాలు వాడితే ప్రయోజనం కలుగుతుంది. దీనికి ఒక గిన్నెలో ఒక గ్లాసు నీరు తీసుకోండి. వాటిని వేడి చేయండి. నీరు వేడిగా అయిన తరువాత అందులో ఒక చెంచా జీలకర్ర రెండు యాలకులు వేయండి. అనంతరం నీటిని వడకట్టాలి. వీటిలో వాడిన జీలకర్ర, యాలకుల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి.

మనం తిన్న ఆహారం ఎందుకు జీర్ణం కాదు. మనం సరిగా నమలకపోవడం వల్ల అరగదు. దీంతో కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. తేన్పులు వస్తాయి. కడుపు గందరగోళంగా అవుతుంది. దీంతో ఏ పని చేయబుద్ధి కాదు. మనసంతా కడుపు మీదే ఉంటుంది. ఇలా గ్యాస్ ట్రబుల్ వల్ల మనకు ఏం తోచదు. అందుకే మనం ఆహారం తీసుకునేటప్పుడు మెత్తగా నమలడం ద్వారా మనకు అజీర్తి సమస్య రాదు. దీంతో గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
మనం తీసుకునే ఆహారం తేలికైనది అయి ఉండాలి. సులభంగా జీర్ణమయ్యే వాటిని ఎక్కువగా తీసుకోవాలి. మసాలాలు, మాంసం వంటి వాటికి దూరంగా ఉంటేనే మంచిది. ఎందుకంటే అవి మన కడుపులో జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. దీంతో కడుపు ఇబ్బందికి గురవుతుంది. సాత్విక ఆహారం తీసుకుంటే తొందరగా జీర్ణం అయి మనకు సమస్యలు లేకుండా చేస్తుంది. ఈ విషయాలు తెలుసుకుని మసలుకుంటే గ్యాస్, ఎసిడిటి, మలబద్ధకం సమస్యలు రాకుండా చేసుకోవచ్చు.