spot_img
Homeఎంటర్టైన్మెంట్Star hero rejected Irumudi movie: 'ఇరుముడి' చిత్రాన్ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో అతనేనా?...

Star hero rejected Irumudi movie: ‘ఇరుముడి’ చిత్రాన్ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో అతనేనా? రవితేజ చేతుల్లోకి ఎలా వెళ్ళింది?

Star hero rejected Irumudi movie: వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న మాస్ మహారాజ రవితేజ(Mass Maharaja Raviteja) మళ్లీ భారీ రేంజ్ లో కం బ్యాక్ ఇవ్వడానికి అన్ని విధాలుగా సిద్ధం అవుతున్నాడు. స్క్రిప్ట్ ఎంపికలో ఇకపై చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అనే బలంగా ఫిక్స్ అయిన రవితేజ, ఆ దిశగానే అడుగులు వేస్తూ ఒప్పుకున్న చిత్రం ‘ఇరుముడి'(Irumudi Movie). ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి అద్భుతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించిన శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకుడు. రవితేజ ఈ చిత్రం లో కూతురు కోసం ఎంతటి పోరాటమైనా చేసే తండ్రి పాత్రలో కనిపించబోతున్నాడు. ఆయనకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేయగా, దానికి ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇది కదా మేము రవితేజ నుండి కోరుకున్నది, ఈసారి కం బ్యాక్ ఇవ్వడం పక్కా అంటూ సోషల్ మీడియా లో ట్వీట్స్ వేశారు నెటిజెన్స్.

అయితే ఈ చిత్రాన్ని ముందుగా రవితేజ తో చెయ్యాలని అనుకోలేదట శివ నిర్వాణ. ఆయన ఈ చిత్రం కథ ని ముందుగా అక్కినేని నాగ చైతన్య కి వినిపించాడట. కానీ ఆయనకు ఉన్న కమిట్మెంట్స్ కారణంగా ఈ సినిమా వెనక్కి వెళ్ళింది. దీంతో శివ నిర్వాణ రవితేజ ని కలిసి స్టోరీ ని చెప్పడం, మేక్ ఓవర్ కోసం ఎదురు చూస్తున్న రవితేజ కి ఇదే పర్ఫెక్ట్ స్టోరీ అని బలంగా నమ్మి ఈ సినిమాని ఒప్పుకోవడం వంటివి జరిగింది. ఈ చిత్రం లో హీరోయిన్ పాత్రకు కూడా చాలా ప్రాధాన్యత ఉంటుందట, ఒకవేళ నాగ చైతన్య ఈ సినిమాని ఒప్పుకొని చేస్తే, ఆడియన్స్ ఆదరిస్తారో లేదో కొద్దిగా అనుమానమే. ఎందుకంటే నాగ చైతన్య యువకుడు, ఆయన లుక్స్ కూడా చాలా యంగ్ గానే కనిపిస్తున్నాయి, ఇలాంటి వ్యక్తి ఒక కూతురికి తండ్రి పాత్ర చేస్తే న్యాచురాలిటీ కి చాలా దూరంగా ఉండేది.

దాని ప్రభావం సినిమా ఫలితం పై గట్టిగా పడే అవకాశాలు ఉంటుంది. అందుకే నాగ చైతన్య కంటే, ఈ చిత్రం రవితేజ చేయడమే కరెక్ట్ అంటూ సోషల్ మీడియా లో ఈ వార్త ని తెలుసుకున్న నెటిజెన్స్ చెప్తున్నారు. అయితే నాగ చైతన్య త్వరలోనే తన 25వ చిత్రాన్ని ప్రారంభించబోతున్నాడు. దీని కోసం స్టోరీ డిస్కషన్స్ ఇప్పటి నుండే మొదలయ్యాయి. శివ నిర్వాణ ఒక అద్భుతమైన లవ్ స్టోరీ ని వినిపించాడట. అది నాగ చైతన్య కి తెగ నచ్చేసిందని అంటున్నారు. చూడాలి మరి ఈ చిత్రం ఎంత వరకు కార్య రూపం దాల్చబోతుంది అనేది. మరో పక్క శివ నిర్వాణ ‘ఇరుముడి’ చిత్రాన్ని జెట్ స్పీడ్ లో పూర్తి చేస్తూ ముందుకు పోతున్నాడు. ఈ చిత్రం లో హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారు అనే దానిపై సస్పెన్స్ ఇంకా వీడలేదు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

YS Jagan Mohan Reddy: ఫైర్ బ్రాండ్లకు జగన్ షాక్!

YS Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ నడిపే విధానంపై సీనియర్లు కాస్త ఆగ్రహంగా ఉన్నారు. ఇకనైనా మేల్కొనకపోతే ఇబ్బందికర పరిస్థితులు...

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
Oktelugu Epaper
Exit mobile version