spot_img
Homeఎంటర్టైన్మెంట్Nagarjuna viral video: 'ఆపరా బాబు..నా పాట పాడకు' అంటూ బ్రతిమిలాడిన నాగార్జున..వీడియో వైరల్!

Nagarjuna viral video: ‘ఆపరా బాబు..నా పాట పాడకు’ అంటూ బ్రతిమిలాడిన నాగార్జున..వీడియో వైరల్!

Nagarjuna viral video: అక్కినేని అభిమానులు నాగార్జున(Akkineni Nagarjuna) విషయం లో చాలా కాలం నుండి తీవ్రమైన అసంతృప్తి తో ఉన్నారు. ఎందుకంటే ఆయనతో సమకాలీన హీరోలైన చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ వంటి వారు వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో నేటి తరం ఆడియన్స్ ని ఒక రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తుంటే, నాగార్జున మాత్రం వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ తో మార్కెట్ మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. పైగా ఈమధ్య కాలం లో క్యారెక్టర్ రోల్స్ కి షిఫ్ట్ అవ్వడం, రజినీకాంత్ ‘కూలీ’ చిత్రం చాలా రెగ్యులర్ విలన్ రోల్ చేయడం, అభిమానులకు ఏమాత్రం నచ్చలేదు. ప్రస్తుతం ఆయన తన వందవ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా మీద అయినా అంచనాలు పెట్టుకుందాం అనుకుంటే, ముక్కు మొహం కూడా తెలియని కార్తీక్ అనే కొత్త డైరెక్టర్ తో పని చేస్తున్నాడు. దీంతో అక్కినేని అభిమానులు నాగార్జున పై ఆశలు వదిలేసుకున్నారు.

ఇది ఇలా ఉండగా రీసెంట్ గా నాగార్జున కి సంబంధించిన ఒక ఫన్నీ వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఒక పార్టీ లో నాగార్జున పాల్గొనగా, అక్కడ ఏర్పాటు చేసిన ఆర్కెస్ట్రా లో సింగర్ నాగార్జున సూపర్ హిట్ చిత్రం ‘నిన్నే పెళ్లాడతా’ లోని ‘ఏటో వెళ్ళిపోయింది మనసు’ పాట పాడుతూ ఉంటాడు. ఇది విన్న నాగార్జున వెంటనే అతని వైపుకు కి వచ్చి చేతులెత్తి దండం పెడుతూ ‘ఆపరా బాబు’ అనే విధంగా ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. దీనిని నెటిజెన్స్ ‘ఖలేజా’ చిత్రం లోని మహేష్ బాబు సన్నివేశం తో అటాచ్ చేసి ఒక వీడియో చేస్తారు. ‘ఖలేజా’ లో కూడా ఇలాగే ఒక వ్యక్తి సంగీతం వాయిస్తూ ఉంటే, మహేష్ బాబు అతని వైపు వెళ్లి ‘బాబు బాబు..నువ్వు ఆపరా నీకు దండం పెడుతాను’ అని అంటాడు.

సరిగ్గా అలాంటి సందర్భాన్ని ఉదహరిస్తూ ఈ వీడియో ని ఎడిట్ చేశారు నెటిజెన్స్. చూసేందుకు ఇది చాలా ఫన్నీ గా అనిపించింది. ఇక నాగార్జున వందవ సినిమా విషయానికి వస్తే, ఇది గోవా బ్యాక్ డ్రాప్ లో జరిగే యాక్షన్ ఎంటర్టైనర్ గా చిత్రీకరిస్తున్నారు. తమిళంలో పలు సినిమాలకు దర్శకత్వం వహించిన కార్తీక్ ఈ చిత్రానికి దర్శకుడు. దసరా కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా తర్వాత నాగార్జున తన తదుపరి చిత్రాన్ని కళ్యాణ్ కృష్ణ తో చేయబోతున్నాడు. ఇది ‘సోగ్గాడే చిన్ని నాయన’, ‘బంగార్రాజు’ చిత్రాలకు సీక్వెల్ గా ఉండనుంది. వచ్చే ఏడాది జనవరి 13న విడుదల కాబోతుంది. ఈ రెండు సినిమాలతో నాగార్జున కం బ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి.

 

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Thammineni Seetharam Case: తమ్మినేని సూత్రధారి.. కోర్టులో సంచలనం!

Thammineni Seetharam Case: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తన అధికార దర్పాన్ని ఉపయోగించి.. నకిలీ పత్రాలతో కుమారుడి పేరుతో నాలుగు కోట్ల రూపాయల విలువైన...

Chennai Love Story Movie: చెన్నై లవ్ స్టోరీ మూవీ ని రిజెక్ట్ చేసి బాధపడుతున్న స్టార్ హీరో…

Chennai Love Story Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తోంది. ఇప్పటికే చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్నారు. ఇక ఇప్పటివరకు ఎవరు ఇలాంటి...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమాను రామ్ చరణ్ చేశాడుగా…

Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు పవన్ కళ్యాణ్... 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో హీరోగా మారిన ఆయన ఆ తర్వాత చేసిన 'గోకులంలో సీత'...

YSRCP: మారిన గిరిజనుల మనసు.. వైసీపీకి డేంజర్ బెల్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక భయం కనిపిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో పార్టీ పుంజుకోకపోవడం పై ఆందోళన నెలకొంది. దశాబ్దాలుగా గిరిజనులు కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్ పతనమై.....

Perni Nani: పేర్ని వారి నకిలీ పట్టాలు.. ఈ కథ మామూలుగా లేదు

Perni Nani: ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వింత వైఖరి వెలుగు చూస్తోంది. చాలామంది నేతలకు పోలీస్ కేసులు చుట్టుముడుతున్నాయి. అయితే అవన్నీ తమ వారసుల ద్వారా.. వారసుల కోసం చేసే...
Oktelugu Epaper
Exit mobile version