Site icon OkTelugu

Apple foldable iPhone: యాపిల్‌ ఫోన్‌ను మడతపెట్టొచ్చు.. పోటీదారులకు షాక్‌

Apple foldable iPhone

Apple foldable iPhone

Apple foldable iPhone: యాపిల్‌.. గాడ్జెట్స్‌ తయారీలో ప్రపంచ వ్యాప్తంగా టాప్‌ సంస్థ. సురక్షితమైన మొబైల్‌ తయారీలో కస్టమర్లను పెంచుకుంటోంది. ఇటీవలే విడుదలైన యాపిల్‌ 17 హాట్‌ కేకుల్లా అమ్ముడయ్యాయి. అయితే యాపిల్‌ ఫోన్లకు ఎంత డిమాండ్‌ ఉన్నా.. శాంసంగ్, వివో, గూగుల్, వన్‌ప్లస్‌ సంస్థలు తయారు చేస్తున్న ఫోల్డబుల్‌ ఫోన్లకు ప్రత్యేక మార్కెట్‌ ఉంది. ఇప్పుడు దీనిని కూడా కొల్లగొట్టేందుకు యాపిల్‌ సిద్ధమైంది. 2026లో ఐఫోన్‌ 18 ప్రో, ప్రోమ్యాక్స్‌తోపాటు ఫోల్డబుల్‌ మోడల్‌ విడుదల చేయాలని భావిస్తోంది.

శాంసంగ్‌తో టైఅప్‌..
శాంసంగ్‌ ఓఎల్‌ఈడీ ఫ్లెక్సిబుల్‌ స్క్రీన్‌లతో యాపిల్‌ సహకారం చేస్తోంది. ఈ టెక్నాలజీ ఫోల్డబుల్‌ డిస్‌ప్లేల్లో అగ్రగణ్యం. యాపిల్‌ ప్రీమియం క్వాలిటీని నిర్ధారిస్తుంది.

డిజైన్‌ ఎంపికలు..
రెండు డిజైన్‌ ఆప్షన్లు ఉంటాయని తెలుస్తోంది. బుక్‌–స్టైల్‌ (తెరిచినప్పుడు టాబ్లెట్‌ స్క్రీన్‌), ఫ్లిప్‌–స్టైల్‌ (మడిచినప్పుడు కాంపాక్ట్‌). ధర సుమారు 2,399 డాలర్లు(రూ.2 లక్షలు) ఉంటుందని రీసెర్చ్‌ర్‌ ఆర్థర్‌ లియావో అంచనా.

పెద్ద స్క్రీన్‌ చాలెంజ్‌
పెద్ద డిస్‌ప్లేలకు అనుగుణంగా హై–కెపాసిటీ బ్యాటరీ, పవర్‌ ఆప్టిమైజేషన్‌ ఆశించవచ్చు. యాపిల్‌ ఎఫిషెన్సీలో ప్రసిద్ధి ఫోల్డబుల్‌ మార్కెట్‌లో బ్యాటరీ లైఫ్‌ కీలకం.

ఫోల్డబుల్‌ ఫోన్‌లపై వినియోగదారుల ఆసక్తి పెరుగుతోంది. యాపిల్‌ ఎంట్రీ మార్కెట్‌ను మార్పు చేస్తుంది. ప్రీమియం సెగ్మెంట్‌లో డిమాండ్‌ పెరుగుతుంది.

 

Exit mobile version