Tulsi Plant
Tulsi Plant: హిందూ ధర్మం ప్రకారం ఇంట్లో తులసి మొక్కను పెంచుకుంటాం. తులసిలో చాలా ఆయుర్వేద గుణాలున్నాయి. దీంతో ఆయుర్వేదంలో తులసికి ప్రాధాన్యం ఉంటుంది. తులసిలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఇది ఇంట్లో ఉంచుకుంటే సాక్షాత్తు శ్రీమహాలక్ష్మీ ఇంట్లో కొలువై ఉన్నట్లుగానే భావిస్తారు. తులసిని అత్యంత పవిత్రంగా చూస్తారు. తులసి విషయంలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. మనం ఏ రోజు ఆకులు కోసుకోవాలి. ఏ రోజు నీళ్లు పోయాలి అనే విషయాలు తెలుసుకుని చేయాలి. లేదంటే ప్రతికూల ప్రభావాలు వచ్చే అవకాశం ఉంటుంది.
నియమాలు ఏమిటి?
తులసి చెట్టుకు నీళ్లు పోయడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. తులసిని పూజించే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. తప్పులు చేయకుండా సరైన పద్ధతిలో తులసిని పూజించాలి. అప్పుడే మనకు అనుకూల ఫలితాలు ఇస్తుంది. తులసికి నీళ్లు పోయాలంటే పనులు తీరాక తీరిక సమయాల్లో పోస్తుంటారు. ఇది కరెక్టు కాదు. కొందరేమో దీపారాధన చేసేటప్పుడే నీళ్లు పోస్తుంటారు. ఇది కూడా సరైంది కాదు. సంధ్యాసమయంలో తులసికి నీళ్లు పోయకూడదు.
లక్ష్మీవిష్ణువుల నివాసం
తులసి చెట్టు కింద విష్ణువు, లక్ష్మీదేవి సేద తీరుతారట. అందుకే సంధ్యా సమయంలో నీళ్లు పోయకూడదు పౌర్ణమి, అమావాస్య, సూర్య, చంద్ర గ్రహణాల సమయంలో కూడా తులసికి నీళ్లు పోయకూడదు. తులసి ఎండిపోయిన ఆకులు ఎక్కువగా ఉన్నట్లయితే ఆ మొక్కను తొలగించి ఎవరు తిరగని చోట వేసి వదిలేయండి. మరో మొక్కను నాటి పెంచాలి.
ఏ రోజుల్లో తాకకూడదు
తులసి మొక్కను ఏకాదశి, ఆదివారం రోజుల్లో అసలు ముట్టుకోకూడదు. ఎండిపోయిన తులసి మొక్క ఇంట్లో ఉంచుకుంటే అరిష్టం. ఆ రోజుల్లో తులసికి నీళ్లు పోయకూడదు. కానీ పూజలు చేయొచ్చు. తులసి ఆకులను గోళ్లతో తెంచకూడదు. స్నానం చేయకుండా తులసి ని ముట్టుకోకూడదు. ఇలాంటి తప్పులు చేస్తే ఇంట్లో చికాకులు వస్తాయి. నిత్యం గొడవలు చోటుచేసుకుంటాయి.