spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Pawankalyan  Vs YS Jagan : పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడా.. మరి మీ తాత...

Pawankalyan  Vs YS Jagan : పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడా.. మరి మీ తాత సంగతేంది జగన్?

Pawankalyan  Vs YS Jagan : జనసేనాని పవన్ ఏపీ పాలిటిక్స్ లో యాక్టివ్ గా మారిన ప్రతిసారి వినిపించే గోల మూడు పెళ్ళిళ్లు, దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్. ఈ గోలపై ఎప్పటికప్పుడు పవన్ కౌంటర్ అటాక్ చేస్తున్నా వైసీపీ బ్యాచ్ లో ఏ మాత్రం మార్పులేదు. చివరకు సాక్షాత్ సీఎం జగన్ సైతం అవే రకమైన ఆరోపణలు చేస్తుండడం వెగటు పుట్టిస్తోంది. వ్యక్తిగత హననం వద్దూ అంటూ పవన్ ఎన్నోసార్లు వారించినా వినడం లేదు. పవన్ పై విమర్శలు చేయడానికి ఏవీ లేవన్నట్టు ఆయన వైవాహిక జీవితంపై పడుతున్నారు. రోజుకు రూ.2 కోట్లు సంపాదించే కెపసిటీ తనదంటూ చెబుతున్న ప్యాకేజీ స్టార్ అని ముద్ర వేసేందుకు తపన పడుతున్నారు.

వారాహి యాత్రలో వైసీపీ నేతలతో పాటు సీఎంను టార్గెట్ చేసుకుంటూ పవన్ ప్రసంగాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పాలనా వైఫల్యాలను ఎత్తిచూపడంతో వైసీపీ బ్యాచ్ ఉక్కిరిబిక్కిరవుతోంది. అందుకే జగన్ సైతం పవన్ పై వ్యక్తిగత విమర్శలకే ప్రయారిటీ ఇస్తున్నారు. చివరకు వారాహి వాహనంపై సైతం చిర్రుబుర్రులాడారు. దానిని లారీతో పోల్చారు. దానిపై నిల్చొని పూనకం వచ్చేలా మాట్లాడుతున్నారంటూ పవన్ పై సెటైర్లు వేశారు. అతడిలా వైవాహిక జీవితంతో రోడ్డున పడలేనని.. నాలుగు నెలలకు ఒక భార్యను మార్చలేనంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాయి. విభిన్నమైన కామెంట్స్ తో హోరెత్తిస్తున్నాయి.

అయితే దీనిపై జన సైనికులు స్ట్రాంగ్ గా రియాక్డవుతున్నారు. పవన్ పై వ్యక్తిగత విమర్శలకు దిగితే ఊరుకుంటామా అంటూ నేరుగా సీఎం ఫ్యామిలీనే ఇందులోకి లాగుతున్నారు. వైఎస్ రాజారెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి, షర్మిళ ఫొటొలు పెట్టి ..మరి మీ ఫ్యామిలీ గురించి ఏమంటావు హన్నయ్య అంటూ వెటకారంగా ప్రశ్నిస్తున్నారు. రాజారెడ్డి ఏకపత్నీవ్రతుడా.. మీ బాబాయ్ వివేకానందరెడ్డి ఒక భార్యతో సరిపెట్టుకున్నాడా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. షర్మిళ ఫొటొను పెట్టి ఎటువంటి కామెంట్ చేయడం లేదు. పవన్ పై అంతకు మించి విమర్శలు చేస్తే మాత్రం ఊరుకోబోమని మాత్రం హెచ్చరిస్తున్నారు. మొత్తానికైతే వైసీపీ, జనసేనల మధ్య వైవాహిక బంధాలపై పెద్ద వారే నడుస్తోంది. అయితే అన్ని అంశాలపై పవన్ క్లారిటీ ఇచ్చారని.. మీరు ఇవ్వగలరా? అని ప్రశ్నించేసరికి వైసీపీ సోషల్ మీడియా నుంచి ఉలుకూ పలుకూ లేకుండా పోతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ కి ఇవే మైనస్ అయ్యాయి…

Chennai Love Story: కిరణ్ అబ్బవరం చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక డిఫరెంట్ అటెంప్ట్ అయితే ఉంటుంది. నటనపరంగా ఆయన కొన్ని విమర్శలను ఎదుర్కొన్నప్పటికి సినిమా కంటెంట్ లో చాలా...

Spain Royal Family: స్పెయిన్‌ రాజవంశంలో కొత్త యుగం… 20 ఏళ్లకే సింహాసనం ఎక్కిన రాణి!

Spain Royal Family: స్పెయిన్‌ యూరప్‌లో చిన్న దేశం. ఇటీవల ఇరాన్‌ యుద్ధ సమయంలో అగ్రరాజ్యం అమెరికా తీరును తప్పు పట్టింది. సైనిక స్థావరం ఏర్పాటుకు కూడా అనుమతి ఇవ్వలేదు. వందల ఏళ్ల...

Chennai Love Story First Day Collections: ‘చెన్నై లవ్ స్టోరీ’ మొదటిరోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. కిరణ్...

Chennai Love Story First Day Collections: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై , కాస్త...

Dharmendra Pradhan Resignation: మోడీ నో అన్నా.. ఎట్టకేలకు ‘ధర్మేంధ్ర ప్రధాన్‌’ రాజీనామా.. తెరవెనుక ఏం జరిగిందంటే?

Dharmendra Pradhan Resignation: నీట్‌ లీకేజీ వివాదం నేపథ్యంలో నెలల తరబడి సాగిన ఆందోళనలు చివరకు ఫలించాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేశారు. నీట్‌ ప్రశ్న పత్రం లీకేజీకి...

Akhil Akkineni: అక్కినేని అఖిల్ ఇండియన్ కాదా..? పూర్తి వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం..

Akhil Akkineni: అక్కినేని అఖిల్ రీసెంట్ గానే 'లెనిన్' చిత్రం తో తన కెరీర్ లోనే మొట్టమొదటి బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. విడుదలై రెండు వారాలు పూర్తి అయ్యింది , ఇప్పటికీ...
Oktelugu Epaper
Exit mobile version