Motorola Edge 60 Pro: Motorola మొబైల్ అంటే కొందరికి విపరీతమైన ఇష్టం ఉంటుంది. ఈ కంపెనీ నుంచి వచ్చి ఫోన్లో ఆకట్టుకునే ఫీచర్స్, అధునాతన టెక్నాలజీ ఉంటుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అందుకు అనుగుణంగానే కంపెనీ లేటెస్ట్ గా Motorola Edge 60 pro అనే మొబైల్ ఇప్పటికే అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ప్రస్తుతం సేల్స్ పెంచుకునేందుకు భారీ డిస్కౌంట్ను ప్రకటించింది. అమెజాన్లో ఆకర్షణ ఏమైనా డిస్కౌంట్తో అమ్మకానికి రెడీ ఉన్న ఈ మొబైల్ గురించి పూర్తి వివరాలు లోకి వెళ్తే..
మార్కెట్లోకి కొత్తగా వచ్చే మొబైల్స్ అది తక్కువ ధరకు ఉండాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు. కానీ ప్రముఖ బ్రాండ్ కంపెనీ అయిన మోటోరోలా కు చెందిన ఎడ్జ్ 60 ప్రో తగ్గింపు వరకు ఇవ్వడంతో నువ్వు తింప్రసావుతున్నారు. ఈ మొబైల్ మార్కెట్లోకి వచ్చిన కొత్తలో రూ.33,999 ధరను ప్రకటించారు. కానీ ప్రస్తుతం రూ.28,990 తో విక్రయిస్తున్నారు. అంటే ఈ మొబైల్ పై నేరుగా రూ.5,009 డిస్కౌంట్ అందిస్తున్నారు. అయితే ఇది నేరుగా కాకుండా ఆన్లైన్లో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు వాడితే అదనంగా రూ.1,750 తగ్గిపోతారు పొందవచ్చు. మరింత తక్కువ ధరకు పొందాలంటే పాత స్మార్ట్ ఫోన్ పై గరిష్టంగా రూ.27,400 కే పొందవచ్చు. అయితే ఈ ధర అనేది పాత స్మార్ట్ ఫోన్ ఉన్న సామర్థ్యాన్ని బట్టి నిర్ణయం జరుగుతుంది.
అయితే ఇప్పటికే మోటరోలా ఎడ్జ్ 60 ప్రో ఫీచర్స్ యూత్ ను ఆకట్టుకున్నాయి. ఇందులో 6.7 అంగుళాల curved స్క్రీన్, ఆకట్టుకునే డిస్ప్లే, 120 HZ మోషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీనిపై అత్యంత రక్షణ ఉండేందుకు పటిష్టమైన గ్లాస్ ను ఏర్పాటు చేశారు. ఇందులో 8gb లేదా 12gb మెమొరీ..256 స్టోరేజ్ ను కలిగి ఉంది. ఇందులో బ్యాటరీ సామర్థ్యం కూడా ఎక్కువగానే ఉంది. 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఫాస్టెస్ట్ చార్జింగ్ తో పాటు వైర్లెస్ చార్జింగ్ కూడా అవకాశం ఉంటుంది. చిన్న గాడ్జెట్ లకు రివర్స్ చార్జింగ్ కూడా చేసుకోవచ్చు.
ప్రతి ఫోన్ లో ఎక్కువగా కెమెరాను చూస్తుంటారు. మోటోరోలా ఎడ్జ్ 60 ప్రోలో కూడా కెమెరా ఆకర్షణీయంగా ఉంది. ఇందులో ప్రతి కామన్ షాట్స్ కోసం 50 mp అందుబాటులో ఉంది. అలాగే 50 ఎంపీ వెడల్పు, 10mp క్లోజప్ కెమెరా ఆప్షన్ ఉంది. హై క్వాలిటీ తోపాటు.. వీడియో కోసం కూడా అనుగుణంగా ఉండే క్వాలిటీ రానుంది. అలాగే ఇందులో స్టీరియో స్పీకర్లు, మైక్రోఫోన్లు వంటి ఫీచర్లు ఉన్నాయి.