Apple: పిల్లలకు మనం ఇచ్చే ఫుడ్ చాలా ముఖ్యం. మీరు ఏ విధంగా ఆహారం ఇస్తున్నారో ఆ ఆహారం చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. అయితే కొందరు మాత్రం చాలా భిన్నంగా పిల్లలకు ఆహారాన్ని అందిస్తున్నారు. చిన్నపిల్లలకు ప్రోటీన్లు, విటమిన్లు అందడం ముఖ్యం. కానీ మనం అందించే ఆహారంతో పిల్లలకు ప్రోటీన్లు అందుతున్నాయో లేదో చూసుకోవడం మరీ ముఖ్యం. అయితే మీ పిల్లలకు ఉడకబెట్టిన పదార్థాలను ఎక్కువగా ఇస్తున్నారా? అందులో యాపిల్ ను కూడా ఉడకబెట్టి ఇస్తున్నారా? దీనివల్ల ఏం జరుగుతుందంటే..
నెలల బేబీకి సెర్లాక్ పెడుతుంటారు. లేదా హోమ్ మేడ్ సెర్లాక్ పెడుతారు. మంత్స్ పెరుగుతున్న కొద్ది అందులో క్యారెట్, బీట్ రూట్ వంటివి వేస్తూ కూడా తినిపిస్తారు. వీటిని ఉడకబెట్టి ఇస్తారు. ఇవి పిల్లలు తినలేరు కాబట్టి ఉడకబెట్టి ఇవ్వడంలో తప్పు లేదు. కానీ ఉడకబెట్టడం వల్ల అందులోని పోషకాలు ఆవిరి అవుతాయి. ఇక యాపిల్ ను కూడా ఉడకబెట్టి ఇస్తున్నారా? నమ్మడం లేదా? చాలా మంది తల్లులు యాపిల్ ను ఉడకబెట్టి ఇస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఎలాంటి లాభం లేదు.
పిల్లలకు అరగదు అని, వాళ్ల గొంతులో అడ్డు పడుతుంది అని యాపిల్ ను ఉడకబెట్టి ఇస్తున్నారు తల్లులు. అయితే కాస్త చిదిమి తినిపిస్తే సరిపోయే యాపిల్ కు ఉడకబెట్టడం ఎందుకు తినిపించడం? ఇందులో ఉండే విటమిన్లు, వాటర్ కంటెంట్ పోవడమే కాదు దీని రుచి కూడా పోతుంది. ఇక ప్రతి ఒక్క పదార్థాన్ని ఉడకబెట్టి ఇవ్వడం వల్ల పిల్లలు నమిలే అలవాటు మానుకుంటారు. అలాంటప్పుడు ఎక్కడికి వెళ్లినా కుక్కర్, మిక్సీ తీసుకొని వెళ్లే పరిస్థితి కూడా వస్తుంది. అందుకే ఈ అలవాట్లను మానుకోండి. ఉడకబెట్టి యాపిల్ ను ఇవ్వడం వల్ల నెగిటివ్ తప్ప కొంచెం కూడా పాజిటివ్ లేదు అని తెలుసుకోండి.