Paper Cups: పేపర్ కప్పులో టీ తాగుతున్నారా.. ఈ విషయం తెలిస్తే ఇకపై ఎవరు పేపర్ కప్ ముట్టుకోరు?

Paper Cups: సాధారణంగా మన ఇండ్లలో పింగాణీ కప్పులు, లేదా స్టీల్ గ్లాస్ లో కాఫీ తాగుతాము.అయితే ఏదైనా హోటల్ వెళ్లినప్పుడు లేదా ప్రయాణాల సమయంలో చాలా మంది ఎక్కువగా పేపర్ కప్స్ లో కాఫీ లేదా టీ ఇస్తుంటారు. ఇక ఏదైనా శుభకార్యాల సమయంలో కూడా ఇలా పేపర్ కప్స్ లో కాఫీ లేదా టీ ఇవ్వడం మనం చూస్తుంటాము. అయితే పేపర్ కప్పులో టీ తాగడం చాలా ఆరోగ్యకరం అని చాలా మంది భావిస్తారు. […]

Written By: Navya, Updated On : January 9, 2022 10:04 am
Follow us on

Paper Cups: సాధారణంగా మన ఇండ్లలో పింగాణీ కప్పులు, లేదా స్టీల్ గ్లాస్ లో కాఫీ తాగుతాము.అయితే ఏదైనా హోటల్ వెళ్లినప్పుడు లేదా ప్రయాణాల సమయంలో చాలా మంది ఎక్కువగా పేపర్ కప్స్ లో కాఫీ లేదా టీ ఇస్తుంటారు. ఇక ఏదైనా శుభకార్యాల సమయంలో కూడా ఇలా పేపర్ కప్స్ లో కాఫీ లేదా టీ ఇవ్వడం మనం చూస్తుంటాము.

Paper Cups

అయితే పేపర్ కప్పులో టీ తాగడం చాలా ఆరోగ్యకరం అని చాలా మంది భావిస్తారు. నిజానికి పేపర్ కప్పులు కాఫీ లేదా టీ తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. మరి ఆ అనారోగ్య సమస్యలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

ప్లాస్టిక్ కప్పులో కాఫీ లేదా టీ తాగినప్పుడు పర్యావరణానికి ఎంతో ప్రమాదం కానీ పేపర్ కప్పులో కాఫీ తాగడం వల్ల మన ప్రాణాలకే ప్రమాదం. మరి ఆ ప్రమాదం ఏమిటి అనే విషయానికి వస్తే… డిస్పోజబుల్ కప్పులలో మూడుసార్లు 100 మి. లీ వేడి టీ తాగడం వల్ల మన శరీరంలోకి 75 వేల అతి సూక్ష్మ హానికర ప్లాస్టిక్ కణాలు శరీరంలోకి ప్రవేశిస్తాయని ఖరగ్‌పూర్‌ ఐఐటీ పరిశోధకులు ఓ అధ్యయనం ద్వారా వెల్లడించారు.

Also Read: Garlic Water: చలికాలంలో టీ బదులు వెల్లుల్లి నీరు తాగితే ఏన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?

ఈ విధమైనటువంటి ప్లాస్టిక్ కణాలను మన శరీరంలోకి వెళ్లడం వల్ల క్రోమియం, కాడ్మియం వంటి లోహాలు శరీరంలో ప్రవేశిస్తాయి. ఈ విధమైనటువంటి డిస్పోజబుల్ కప్పులలో తేలికైన ప్లాస్టిక్‌‌లో డెన్సిటీ పాలిథిలిన్‌ ఉండటం వల్ల సాధారణ పరిస్థితుల్లో ఈ కప్పులను రీసైక్లింగ్ చేయటానికి కష్టతరమవుతుంది. అందుకే వీలైనంత వరకు పేపర్ కప్ లలో కాకుండా స్టీల్ గ్లాసులలో కాఫీ లేదా టీ తాగడం ఎంతో మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు.

Also Read: Figs: అత్తి పండ్లు తినేవాళ్లకు షాకింగ్ న్యూస్.. వాళ్లు అస్సలు తినకూడదట!