Supreme Court: పంజాబ్ పర్యటనలో ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీని రోడ్డుపై నిలిపి రైతులు చేసిన ఆందోళనల నేపథ్యంలో రెండు ప్రభుత్వాలు తప్పు మీదంటే మీదే అంటూ నిందించుకుంటున్నాయి. నాలుగు రోజుల క్రితం పంజాబ్ రాష్ర్టంలో ప్రధాని పర్యటించినప్పుడు భద్రతా వైఫల్యాలు కనిపించాయి. ఇరవై నిమిషాల పాటు ప్రధాని రోడ్డు మీదే ఉండాల్సి వచ్చింది. దీంతో కేంద్రం, రాష్ర్టం ఒకరిపై మరొకరు బురద జల్లుకునేందుకు సిద్ధమై రెండు కమిటీలు వేశాయి. దీంతో రాజకీయంగా రెండు పార్టీలకు ఎదురుదెబ్బలే తగలనున్నట్లు తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో భద్రతా వైఫల్యం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ప్రధాని వెళ్లే మార్గాన్ని రాష్ర్ట యంత్రాంగం సునిశితంగా పరిశీలించాల్సి ఉన్నా పట్టించుకోలేదని తెలుస్తోంది. దీంతోనే ప్రధాని కాన్వాయ్ ని అడ్డుకోవడంతో ఆయన అర్థంతరంగా తన పర్యటన ముగించుకుని వెళ్లిపోవడం గమనార్హం. దీనిపై కేంద్రం, రాష్ర్టం కూడా రెండు కమిటీలు వేసినా సుప్రీంకోర్టు మాత్రం కమిటీలు అక్కర్లేదని చెప్పడం కొసమెరుపు.
Also Read: జగన్ నిర్ణయం.. వాట్సాప్ గ్రూపుల నుంచి ఉద్యోగులు నిష్క్రమణ
ప్రధానికి ఎస్పీజీ భద్రత ఉన్నా రోడ్డుపై రైతులు ఆపడంతో అందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దేశానికి ప్రధాని అయినా రోడ్డుపై అడ్డుకోవడంతో మన ప్రతిష్ట ఏంటో అందరికి అర్థమైపోయింది. రాష్ర్ట ప్రభుత్వ తీరును ప్రతి ఒక్కరు విమర్శిస్తున్నారు. భద్రతను పటిష్టం చేయడంలో మాత్రం విఫలమైనట్లు తెలుస్తోంది. పంజాబ్ లో బీజేపీ రాబోయే ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న ఇలాంటి పరిణామాలు మరింత దిగజార్చుతున్నాయి.
యూపీలో జరిగిన సంఘటనలో మంత్రి ప్రశాంత్ కుమార్ ను మంత్రి వర్గం నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రధాని ఏం చేయలేక నిర్ఘాంతపోయారు. ప్రధాని వస్తున్నట్లు వారికి తెలియకపోయినా కాన్వాయ్ ను చూసి ఆపి వారి డిమాండ్లు వ్యక్తం చేయడంతో ఏం తేల్చుకోలేకపోయారు. అకస్మాత్తుగా జరిగిన సంఘటనకు ప్రధాని సైతం ఆశ్చర్యం వ్యక్తం చేయడం తప్ప ఏం చేయలేకపోయారు. ఈ క్రమంలో ప్రభుత్వాలు వేసిన కమిటీలు మాత్రం రద్దు చేసి సుప్రీంకోర్టు ఏం చెబుతుందో వేచి చూడాల్సిందే.
Also Read: పొత్తులకు టీడీపీ ఆరాటం.. చంద్రబాబుది వన్ వే లవ్..?