Chanakya Niti: సాధారణంగా మన ఇండ్లలో చాలా విషయాల్లో కొన్ని నమ్మకాలను ఎంతో విశ్వసిస్తారు. ఈ క్రమంలోనే ఏదైనా శుభకార్యం తలపెట్టినప్పుడు నల్ల పిల్లి ఎదురు రావడం, అలాగే ఇంట్లో అద్దం పగిలిపోవడం, ఉన్నఫలంగా దేవుడి దగ్గర వెలుగుతున్న దీపం ఆరిపోవడం వంటివి జరిగితే చాలామంది చెడుకు సంకేతమని భావిస్తారు.
ఇలా ఒక్కొక్కరు ఒక్కో రకమైన నమ్మకాలను బలంగా నమ్ముతారు.కానీ మన ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎదురవుతున్నాయి అంటే ముందుగానే కొన్ని లక్షణాలు మనకు కనిపిస్తాయి అని ఆచార్య చాణిక్యుడు తన నీతి గ్రంథంలో తెలియజేశాడు. మరి ఆ లక్షణాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…
* మన ఇంట్లో ఉన్న ఫలంగా అద్దం లేదా గాజు వస్తువులు పగిలిపోతే అది కూడా ఆర్థిక సంక్షోభానికి సంకేతం.అందుకే ఇలాంటివి ఇంట్లో ఉంటే వెంటనే పడేయండి.
* తరుచూ ఇంట్లో గొడవపడే వారి ఇంట్లో లక్ష్మీదేవి ఉండటానికి ఇష్టపడదు. ఇలాంటి వారి ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది.
Also Read: Chanakya Niti: అమ్మాయిలలో ఉండకూడని రెండు లక్షణాలు ఇవే.. ఇలాంటి వారితో స్నేహం కూడా ప్రమాదమే..!
*ఇంట్లో ఎవరైతే తల్లిదండ్రులను,వృద్ధులను అవమాన పరుస్తున్నారు అలాంటి వారి ఇంటిలో కూడా లక్ష్మీదేవి కొలువై ఉండదు. ఇలాంటి వారి ఇంటిలో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.
*ఎవరి ఇంట్లో అయితే దీపారాధన చేయరో అలాంటి వారి ఇంట్లో ప్రతికూల పరిస్థితులు పరిస్థితులు ఏర్పడతాయి.ఇలాంటి వారి ఇంటిలో కూడా లక్ష్మీదేవి ఉండటానికి ఇష్టపడకపోవడం వల్ల ఇంట్లో ఇబ్బందులు తలెత్తుతాయి.