Children Food: పిల్లలు ఇష్టంగా ఆహారం తినాలంటే ఇలా చేయండి..

పిల్లలు తినకపోతే ఊరుకుంటారా? ఎలాగైనా తినిపించాలి అని నోట్లో కుక్కుతుంటారు కదా చాలా మంది. అందులో మీరు కూడా ఒకరా? కానీ ఇలా చేయడం వల్ల పిల్లలు ప్లేట్ చూస్తేనే పారిపోతారు. అన్నం అనే పేరు తీస్తేనే ఆమడ దూరం వెళ్తుంటారు.

Written By: Swathi Chilukuri, Updated On : June 26, 2024 3:05 pm

Children Food

Follow us on

Children Food: పిల్లలను పెంచడం పెద్ద టాస్క్ కదా. ఇక ఇంట్లో పెద్దవారు లేకపోతే వామ్మో చాలా కష్టం. వారి ఆలనాపాలనా మొత్తం చూసుకోవాల్సిందే. ఇక తినిపించడం అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఇది పెద్ద ఘట్టం. మరి మీ పిల్లలకు మీరు ఎలా తినిపిస్తున్నారు. ఫోన్ ఇచ్చి తినిపిస్తున్నారా? చందమామ కథలు చెబుతూ తినిపిస్తున్నారా? అయినా మన పిచ్చి కాకపోతే ఏం చేసినా అంత ఈజీగా తింటే వారు పిల్లలు ఎలా అవుతారు కదా. మరి కాస్త మీ బుడతడు ఫుడీగా మారడానికి చిన్న టిప్స్ అయితే ట్రై చేసి చూడండి. ఫలితం చూద్దాం.

పిల్లలు తినకపోతే ఊరుకుంటారా? ఎలాగైనా తినిపించాలి అని నోట్లో కుక్కుతుంటారు కదా చాలా మంది. అందులో మీరు కూడా ఒకరా? కానీ ఇలా చేయడం వల్ల పిల్లలు ప్లేట్ చూస్తేనే పారిపోతారు. అన్నం అనే పేరు తీస్తేనే ఆమడ దూరం వెళ్తుంటారు. అందుకే ఇలా కాకుండా కాస్త నిదానంగా, ఓపికగా, వారికి నచ్చే విధంగా, మీకు ఇబ్బంది కలగకుండా, ఇర్రిటేషన్ అనిపించకుండా కొన్ని టిప్స్ పాటిస్తే ఇద్దరికి సంతోషమే కదా.

నోట్లో కుక్కడం వల్ల, లేదంటే మెత్తగా చేసి తినిపించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. మెత్తగా చేస్తే నమలడం పిల్లలకు అలవాటు కాదు. కొత్తగా దంతాలు వచ్చే సమయంలో వాటిని ఉపయోగించకుండా మింగడం వల్ల ఆహారంలో లాలాజలం కలవదు. ఇలా కలవకపోతే ఆహారం జీర్ణం అవదు. ఇలాంటి ఆహారంలో పీచు, పోషకాలు కూడా అందవట. అందుకే పిల్లలకు పోషకాహారాన్ని అందించే విషయంలో కాస్త సహనం ఉండాల్సిందే.

వారికి తినిపించే బౌల్, ప్లేట్ కాస్త ఆకర్షణీయంగా చూడటానికి ఆడుకునే పరికరంగా అనిపిస్తే వారికి ఇష్టంగా అనిపిస్తుంది. భోజనం ప్లేట్ లో స్ట్రాబెర్రీలు వంటివి పెడుతుండాలి. కుటుంబ సభ్యుల సమక్షంలో తినిపించాలి. ఒక గేమ్ మాదిరి, ఎవరు ముందు తింటారు అంటూ చెబుతూ ఆడిపిస్తూ తినిపిస్తే ఇష్టంగా తింటారు కూడా. ఆహారం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు చెప్పాలి. వారికి ఇంట్రెస్ట్ గా అనిపిస్తుంది. తినాలి అని కోరిక కలుగుతుంది. సో మీ పిల్లలు ఫుడీగా మారుతారు. మరి ట్రై చేయండి.