MRP Rate: MRP కంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నారా? అయితే లక్ష ఫైన్ కట్టాల్సిందే

నెల జీతం వస్తే ఈఎమ్ఐలు, రూమ్ రెంట్, ఇంట్లోకి సరుకులు, షాపింగ్ లు, సినిమాలు, షికార్లు ఇన్ని ఉన్న దగ్గర పాపం బక్క పానం అయినా జీతం నిలబడుతుందా? బారెడు లిస్ట్ కేవలం మూరెడు జీతం సో తప్పదు కదా. దీనికి తోడు ఉన్న ధర కంటే ఎక్కువ ధరకు అమ్మే దుకాణం దారులు.

Written By: Swathi Chilukuri, Updated On : June 26, 2024 3:01 pm

MRP Rate

Follow us on

MRP Rate: జీతం తక్కువ ఖర్చులు ఎక్కువ. మీలో ఎంత మందికి నెల జీతం వస్తే మళ్లీ జీతం వచ్చే వరకు డబ్బులు జేబులో ఉంటాయో ఓ సారి కామెంట్ చేయండి. కష్టమే కదా. అయినా తప్పదు. ఎందుకంటే అలా ఉంటాయి మరీ ఖర్చులు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఎలాంటి వస్తువు అయినా సరే కొనుగోలు చేయాల్సిందే. ప్రతి వస్తువు కొనాలంటే జీతంలో నుంచి డబ్బును కోత కోయాల్సిందే. దీనికి తోడు అధిక రేట్లు వెక్కిరిస్తుంటాయి. మరి మీరు ఎక్కడికి అయినా వెళ్తే ప్రాడక్ట్ మీద ఉన్న రేటు కంటే ఎక్కువ రేటుకు కొనుగోలు చేస్తున్నారా?

నెల జీతం వస్తే ఈఎమ్ఐలు, రూమ్ రెంట్, ఇంట్లోకి సరుకులు, షాపింగ్ లు, సినిమాలు, షికార్లు ఇన్ని ఉన్న దగ్గర పాపం బక్క పానం అయినా జీతం నిలబడుతుందా? బారెడు లిస్ట్ కేవలం మూరెడు జీతం సో తప్పదు కదా. దీనికి తోడు ఉన్న ధర కంటే ఎక్కువ ధరకు అమ్మే దుకాణం దారులు. అబ్బో సామాన్యులు బతకడం కష్టమే బాబోయ్. కానీ ఒక పౌరునిగా పుట్టిన తర్వాత ప్రతి విషయాన్ని ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఎక్కువ ధరకు ఎందుకు అమ్ముతున్నారో కూడా మీరు అడగవచ్చు.

అమ్మో నువ్వు రాతలు రాస్తవ్. కానీ అడిగితే యాక్షన్ తీసుకునే వారు ఎవరమ్మా? కొంటే కొను లేదంటే ఇక్కడ నుంచి వెళ్లు అంటారు అని డీలా పడకండి. ఓ యాక్ట్ గురించి చెబుతాను. సో ధైర్యంగా మీరు ప్రశ్నించండి. లీగల్ మెట్రాలజీ యాక్ట్ అనే ద్వారా మీరు అడగండి. మెట్రోలు, రైల్వే స్టేషన్ లు, రైల్ వంటి రద్దీ ఉండే ప్రాంతాల్లో వస్తువు మీద ఉన్న ధర కంటే అధిక ధరకు అమ్మితే కచ్చితంగా మీరు అడగవచ్చు. వినకపోతే యాక్షన్ తీసుకుంటారు కూడా.

1800111139 అనే నెంబర్ కు కాల్ చేయవచ్చు. లేదా 9711111139 అనే నెంబర్ కు మెసేజ్ చేయవచ్చు. ఎవరి మీద అయినా ఈ యాక్ట్ కింద కేసు నమోదు అయితే మొదటి సారి రూ. 25000 జరిమానా విధిస్తారు. రెండోసారి అయితే ఏకంగా రూ. 50000 కట్టాలి. మూడవ సారి అయితే కచ్చితంగా రూ. లక్ష కట్టాల్సిందే. అంతేకాదు సంవత్సరం పాటు జైలు శిక్ష కూడా విధిస్తారు.