Kalki Movie: కల్కి 2829 AD విడుదలకు మరో కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. అప్పుడే ప్రభాస్ రికార్డుల మోత షురూ చేశాడు. యూఎస్ లో కల్కి చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ చూసి ట్రేడ్ వర్గాలు షాక్ అవుతున్నాయి. సాధారణంగా యూఎస్ ఆడియన్స్ క్లాస్, హాలీవుడ్ తరహా చిత్రాలు ఎక్కువగా ఇష్టపడతారు. కల్కి మూవీ అవుట్ అండ్ అవుట్ హాలీవుడ్ రేంజ్ చిత్రం. ఉన్నత నిర్మాణ విలువలతో భారీగా తెరకెక్కించారు. కల్కి టీమ్ విడుదల చేసిన రెండు ట్రైలర్స్ ఆకట్టుకున్నాయి. దీంతో అంచనాలు మరింతగా పెరిగాయి.
కాగా యూఎస్ లో కల్కి కాసుల వర్షం కురిపిస్తుంది. అక్కడ 500 లొకేషన్స్ లో 3000 షోలకు గాను 1.5 లక్షల టికెట్స్ అమ్ముడుపోయాయి. మొత్తంగా కల్కి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే $4 మిలియన్ వసూళ్లను అధిగమించింది. ఈ ఫీట్ సాధించిన మొదటి ఇండియన్ మూవీగా కల్కి రికార్డులకు ఎక్కింది. ఇక పాజిటివ్ టాక్ వస్తే కల్కి వసూళ్లు భారీగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. బాహుబలి 2, ఆర్ ఆర్ ఆర్ వంటి చిత్రాలను అధిగమించినా ఆశ్చర్యం లేదు.
Also Read: Senior Actor: సీనియర్ నటుడు కొనుగోలు చేసిన ఈ ఖరీదైన కారు ధర ఎంతో తెలుసా?
కల్కి మైథలాజికల్ టచ్ తో కూడిన సైన్స్ ఫిక్షన్ మూవీ. ప్రభాస్ భైరవ పాత్ర చేస్తున్నారు. అమితాబ్, కమల్ హాసన్ వంటి లెజెండ్స్ భాగమయ్యారు. ముఖ్యంగా అమితాబ్ పాత్ర ఆసక్తి రేపుతోంది. ఆయన అశ్వద్ధామ అనే పురాణ పాత్ర చేస్తున్నారు. భైరవ-అశ్వద్ధామ తలపడటం కొత్తగా ఉంది. దీపికా పదుకొనె కేంద్రంగా కథ నడిచే అవకాశం ఉంది. దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్ తో కల్కి చిత్రాన్ని రూపొందించారు.
Also Read: Vinoth Kishan: సినిమా హిట్ అయ్యాక వడ్డీతో సహా ఇచ్చేస్తా… కొత్త హీరో వింత రిక్వెస్ట్!
ఇక ప్రభాస్ నటిస్తున్న ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి కావడం విశేషం. బాహుబలి 2 అనంతరం ఆయన నటించిన సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ నిరాశపరిచాయి. సలార్ చిత్రంతో ఆయన హిట్ ట్రాక్ ఎక్కారు. కల్కి మూవీతో ప్రభాస్ మరో భారీ హిట్ ఖాతాలో వేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. జూన్ 27న కల్కి వరల్డ్ వైడ్ పలు భాషల్లో విడుదల చేస్తున్నారు. నేటి అర్ధరాత్రి నుండి యూఎస్ లో ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు.