Wife  Anger : భార్య కోపాన్ని తగ్గించడానికి ఈ నాలుగు పనులు చేయండి.. అవేంటంటే?

భాగస్వామి కోసం ప్రాణ త్యాగం చేయకున్నా కొన్ని విషయాల్లో మాత్రం అనుకూలంగా ఉండడం వల్ల భర్తను భార్య ఎప్పటికీ మంచిగా చూసుకుంటుందని చెబుతున్నారు. మరి భార్యను సంతోషపెట్టడానికి ఎలాంటి పనులు చేయాలి? ఏం చేస్తే భాగస్వామి చికాకు పడకుండా ఉంటుంది?

Written By: Chai Muchhata, Updated On : September 10, 2024 4:21 pm

Wife  Anger

Follow us on

Wife  Anger :  భార్యభర్తల మధ్య బంధం ఎంతో ధృఢమైనదిగా భావిస్తారు. ఒకప్పుడు పెద్దలు కుదిర్చిన వివాహం అయినా కలకాలం కలిసి ఉండేవారు. కానీ ప్రస్తుతం కాలంలో ఇలా పెళ్లి చేసుకొని అలా విడాకులు తీసేసుకుంటున్నారు. దంపతుల మధ్య విభేదాలు రావడానికి చాలా కారణాలు ఉండొచ్చు. కానీ భార్యను సంతోష పెట్టడానికి భర్త కొన్ని పనులు చేయడం ద్వారా ఎలాంటి మనస్పర్థలు ఉండవని కొందరు మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. భాగస్వామి కోసం ప్రాణ త్యాగం చేయకున్నా కొన్ని విషయాల్లో మాత్రం అనుకూలంగా ఉండడం వల్ల భర్తను భార్య ఎప్పటికీ మంచిగా చూసుకుంటుందని చెబుతున్నారు. మరి భార్యను సంతోషపెట్టడానికి ఎలాంటి పనులు చేయాలి? ఏం చేస్తే భాగస్వామి చికాకు పడకుండా ఉంటుంది?

సంసార సాగరంలో ఈదడం అంటే మామూలు విషయం కాదు. కష్టాలు, నష్టాలు ఉంటాయి. ఇలాంటి సమయంలో ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఒకరి పనులకు మరొకరు సాయం చేస్తూ ఉంటారు. అయితే ఒకరి పనులు మరొకరు చేయకున్నా.. ఎవరి పనులు వారు క్లీన్ గా చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా ఇంట్లో నీట్ నెస్ విషయంలో కొందరు వివాహితులు పకడ్బందీగా ఉంటారు. ఇల్లో శుభ్రంగా లేకుంటే వారికి నచ్చదు. ఈక్రమంలో భర్త సైతం అపరిశుభ్రమైన వాతావరణం కలగజేస్తే కోప్పడుతుంది. అందువల్ల టేబుల్ పై టవల్ వేయడం, ఎక్కడపడితే అక్కడ వాచ్ ను వదిలేయడం వంటివి చేయకండి. వాటికి సరైన ప్రదేశాన్ని ఎంచుకొని రోజూ అక్కడే వేయండి. ఇలా చేయడం వల్ల భార్య మనసును నొప్పించకుండా ఉంటుంది. దీంతో వారు సంతోషంగా ఉంటారు.

ఏ భార్య అయినా తన భర్త నుంచి ప్రేమను, ఆప్యాయతను కోరుకుంటుంది. ఉద్యోగం, వ్యాపారం కారణంగా బయటికి వెళ్లొచ్చిన భర్త సమయం తీసుకొని భార్యతో ప్రేమగా ఉండే ప్రయత్నం చేయాలి. కానీ కొందరు ఇంటికి రాగానే ఎక్కువగా మొబైల్ తో గడిపేస్తుంటారు. లేదా మద్యం సేవిస్తూ ఉంటారు. ఇంకొందరు సినిమాలు చూస్తూ సమయాన్ని వృథా చేస్తారు. అలా కాకుండా భార్యతో సంతోషంగా ఉండేందుకు ప్రయత్నిస్తే ఆమె మీకోసం ఏం చేయడానికైనా రెడీగా ఉంటుంది.

కొందరు భార్య కంటే ఎక్కువగా స్నేహితులతో గడిపేయడం చాలా ఇష్టం. కానీ ఇది భార్యకు వ్యతిరేకం అనిపిస్తుంది. అయితే స్నేహితులను కలవడానికి ఓ పర్టికులర్ టైం తీసుకొని వారిని కలుస్తూ ఉండాలి. అంతేగానీ భాగస్వామిని అవైడ్ చేస్తూ స్నేహితులతను కలవడం వల్ల భార్యకు కోపం వస్తుంది. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు వస్తాయి.

చాలా మందికి ఇంట్లో ఫుడ్ ఎక్కువగా ఇష్టం ఉండదు. దీంతో కొందరు ప్రతీరోజూ హోటల్ లో ఫుడ్ తింటూ ఉంటారు. ఇది భార్యకు నచ్చదు. అయితే భోజనం నచ్చకపోతే తనతో ఆ విషయం చెప్పండి. ఆ తరువాత రుచికరంగా ఉండేలా చూసుకోవాలి. అంతేగానీ ప్రతి రోజూ బయట ఫుడ్ తినడం వల్ల భార్యకు నచ్చదు. దీంతో తన వంటకు వ్యతిరేకంగా ఉండడం వల్ల చికాకు పడుతారు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు వస్తాయి.