https://oktelugu.com/

Chanakya Nithi : భార్య ఇలా ఉంటే వెంటనే విడాకులు ఇచ్చేయండి..! లేకుంటే ప్రమాదమే..

తన భార్య ఏ విధంగా ప్రవర్తిస్తుందో గుర్తించడం చాలా అవసరం అని అంటున్నారు. అయితే చాణక్యుడు చెప్పిన ప్రకారం ఒక వ్యక్తి తన భార్యకు ఇలాంటి లక్షణాలు ఉంటే కలిసి ఉండడం కలంటే విడిపోవడమే మంచిదని అంటున్నారు. అయితే ఎలాంటి లక్షణాలు ఉన్న భార్యకు దూరంగా ఉండాలి?

Written By:
  • Srinivas
  • , Updated On : September 11, 2024 / 01:03 AM IST

    Chanakya Nithi

    Follow us on

    Chanakya Nithi :  అపర చాణక్యుడు తాను చెప్పిన కొన్ని సూత్రాలు జీవితానికి ఎంతో ఉపయోగపడుతాయి. చాణక్యుడు రాజ్యానికి సంబంధించినవే కాకుండా వ్యక్తి జీవితానికి అవసరమైన విలువైన విషయాలను చెప్పాడు. వీటిలో ముఖ్యంగా భార్యభర్తల మధ్య ఉండే సంబంధాలను చక్కగా వివరించారు. వీటిని చాలా మంది ఫాలో అవుతూ వస్తున్నారు. మరికొందరు చాణక్య పుస్తకాల ద్వారా తెలుసుకుంటున్నాడు. ఒక వ్యక్తి తన జీవితంలో ఎక్కువ భాగం భార్యతోనే కలిసి ఉంటారు. ఈ క్రమంలో భార్య ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నారో తెలుసుకోవాలి. తన భార్య ఏ విధంగా ప్రవర్తిస్తుందో గుర్తించడం చాలా అవసరం అని అంటున్నారు. అయితే చాణక్యుడు చెప్పిన ప్రకారం ఒక వ్యక్తి తన భార్యకు ఇలాంటి లక్షణాలు ఉంటే కలిసి ఉండడం కలంటే విడిపోవడమే మంచిదని అంటున్నారు. అయితే ఎలాంటి లక్షణాలు ఉన్న భార్యకు దూరంగా ఉండాలి?

    కొంత మంది ఆడవాళ్లు తమ కోసం మాత్రమే పనిచేయాలని అనుకుంటారు. పొద్దంతా ఉద్యోగం, వ్యాపారానికి వెళ్లి ఇంటికి వస్తే అస్సలు పట్టించుకోరు. కనీసం ఆహారం విషయంలోనూ కేర్ లెస్ గా ఉంటారు. అలాగే అత్యాశతో ఉన్న భార్య వల్ల చాలా అనర్థాలను ఎదుర్కోవాల్సి వస్తుందని చాణక్యుడు చెప్పాడు. భార్యకు అత్యాశ ఉంటే పురుషుడి సంపాదన అంతా భార్య ఖర్చులకే సరిపోతుంది. అందువల్ల ఇలాంటి వారితో విడిపోవడం మంచిదని అంటున్నారు.

    ఆడవారు సాంప్రదాయంగా ఉండడం వల్ల చక్కగా కనిపిస్తారు. అయితే కొందరు ఏమత్రం నాగరికత లేకుండా వ్యవహరిస్తారు. ఉదయం సరైన సమయానికి నిద్ర లేవకపోవడం, ఇంటికి అవసరమైన పనులు చేయకుండా ఉంటారు. అంతేకాకుండా ఎక్కువగా పురుషుడితో పనులు చేయించుకోవాలని చూస్తారు. దీంతో భర్త ఉద్యోగంతో పాటు ఇంట్లోనూ కష్టం ఎదుర్కొంటారు. ఇలాంటి వారితో కలిసి ఉండడం వల్ల జీవితాంతం కష్టాలు పడాల్సి వస్తుంది.

    కొందరు స్త్రీలకు అమితంగా కోరికలు ఉంటాయి. పురుషుడితో కాకుండా ఇతరులతో కలిసి ఉండాలని కోరుకుంటారు. ఈ విషయంలో వారిని వారించినా కూడా వినరు. దీంతో భార్యభర్తల మధ్య మనస్పర్థాలు వస్తాయి. ఆ తరువాత భర్త గట్టిగా వారిస్తే వారు అనుకున్నది సాధించలేకపోయామని ఎప్పుడూ భర్తకు దూరంగా ఉంటారు. ఇలాంటి వారి గురించి తెలిసిన వెంటనే వారి నుంచి దూరంగా ఉండడం మంచిది.

    భార్యభర్తలు అన్యోన్య దంపతుల్లా కలిసి మెలిసి ఉండాలి. కానీ కొందరు ఆడవాళ్ల తమ భర్తలపై పెత్తనం చెలాయించాలని చూస్తారు. ఎప్పుడు తనదే పైచేయి కావాలని చూస్తారు. ఈ క్రమంలో భర్త చేసే ఏ పని అయినా ఎగతాళి చేస్తూ ఛీప్ గా చూస్తారు. అలాంటి భార్యతో ఉండడం వల్ల ఎప్పటికైనా ప్రమాదమే. ఎంతో సహనం పాటిస్తే చేతకాదు అని ముద్ర కూడా వేస్తారు. దీంతో ఇలాంటి వారితో ఉండడం కంటే విడిపోవడమే మంచిది అని చాణక్యుడు తన సూత్రాల్లో చెప్పాడు.

    కొందరు తమ భర్త గురించి ఇతరులకు చెడు చెబుతూ ఉంటారు. మంచి విషయాలను మాత్రం పట్టించుకోరు. తమ కంటే తమ భర్త తక్కువ అని చెప్పుకునే వారికి దూరంగా ఉండడమే మంచిది అని చాణక్యుడు చెప్పాడు.