Overthinking : అతిగా ఆలోచించడం కూడా.. ఆరోగ్యానికి ముప్పే?

ఎప్పుడో ఒంటరిగా కూర్చున్నప్పుడు ఆలోచిస్తే పర్లేదు. కానీ అదే పనిగా రోజంతా ఆలోచించుకుని కూర్చుంటే.. అది అలవాటు అవుతుంది. దీనివల్ల మానసికంగా ఎన్నో ఇబ్బందులు పడతారు. ఎంత ఆరోగ్యవంతులు అయిన వాళ్లు అతిగా ఆలోచిస్తే.. అనారోగ్యలు అవుతారు. ఎంత తక్కువ ఆలోచిస్తే ఆరోగ్యానికి అంత మంచిది.

Written By: Bhaskar, Updated On : September 10, 2024 12:42 pm

Overthinking

Follow us on

Overthinking : ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది. వ్యక్తిగతంగా, ఆఫీస్ ఇలా ఏదో ఒక సమస్య వల్ల కొందరు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఒత్తిడి, ఆందోళన వంటివి వాటి వల్ల కూడా చిన్న విషయానికి కూడా ఎక్కువగా ఆలోచిస్తుంటారు. అయితే ఇలా ఎక్కువగా ఆలోచించడం కూడా ఆరోగ్యానికి హానికరమే అని నిపుణులు అంటున్నారు. గతంలో జరిగిన విషయాలు, భవిష్యత్తులో ఏం జరుగుతుందో అనే భయంతో ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఆలోచించకూడదని ఎంత అనుకున్న కూడా పదే పదే గుర్తు తెచ్చుకుని మరి ఆలోచిస్తారు. ఎప్పుడో ఒంటరిగా కూర్చున్నప్పుడు ఆలోచిస్తే పర్లేదు. కానీ అదే పనిగా రోజంతా ఆలోచించుకుని కూర్చుంటే.. అది అలవాటు అవుతుంది. దీనివల్ల మానసికంగా ఎన్నో ఇబ్బందులు పడతారు. ఎంత ఆరోగ్యవంతులు అయిన వాళ్లు అతిగా ఆలోచిస్తే.. అనారోగ్యలు అవుతారు. ఎంత తక్కువ ఆలోచిస్తే ఆరోగ్యానికి అంత మంచిది.

అధిక రక్తపోటు
మితిమీరిన ఆలోచన అధిక రక్త పోటుకి దారి తీస్తుంది. ఆలోచించడం వల్ల మనసు ప్రశాంతత కోల్పోతారు. అలా రక్త పోటు పెరిగి.. అధిక కొలెస్ట్రాల్ పెరగడంతో పాటు గుండె పోటు వంటి సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి కాస్త ఆలోచించడం మానేయండి.

నిద్ర సమస్యలు
ఎక్కువగా ఆలోచిస్తే.. అసలు నిద్ర పట్టదు. ఎంత నిద్ర వచ్చిన ఆలోచిస్తే నిద్ర రాదు. ఇలా నిద్ర లేమి వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ఒక్కరోజు నిద్ర లేకపోతే నీరసంగా ఉంటారు. ఏ పని మీద కూడా ఇంట్రెస్ట్ చూపించలేరు. కాబట్టి ఆలోచించడం మానేస్తే ఆరోగ్యంగా ఉంటారు.

ఆకలి తగ్గిపోతుంది
ఆలోచన ఆకలిని కూడా చంపేస్తుంది. అతి ఆలోచన మెదడుపై ప్రభావం పడుతుంది. దీంతో ఒత్తిడికి లోనై ఆకలి చచ్చిపోతుంది. అయితే కొందరిలో అతి ఆలోచన ఎక్కువగా తినేలా కూడా చేస్తుంది.

మెదడుపై ప్రభావం
ఎక్కువగా ఆలోచించడం వల్ల మెదడుపై ప్రభావం పడుతుంది. దీనివల్ల ఆందోళన, ఒత్తిడికి గురి అయి.. మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.

జీర్ణ వ్యవస్థ
అతిగా ఆలోచిస్తే ఆందోళన, ఒత్తిడి వస్తుంది. దీని వల్ల వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆకలి లేకపోవడం వల్ల ఫుడ్ తినరు మ్ దీంతో జీర్ణ వ్యవస్థ బలహీనపడుతుంది.

రోగ నిరోధక శక్తి
ఎక్కువగా అలోచించి ఒత్తిడికి గురి అయితే రోగనిరోధక శక్తిని బలహీన పడుతుంది. దీని వల్ల అలెర్జీలు, ఇన్ఫెక్షన్లు వంటివి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి అతిగా ఆలోచించడం మానేయడం బెటర్.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించేముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.