LPG: దేశంలో దాదాపుగా అందరి ఇళ్లలో గ్యాస్ సిలిండర్లు ఉంటాయి. గ్యాస్ సిలిండర్లను వాడటం ద్వారా సులభంగా వంట చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ సైతం గ్యాస్ సిలిండర్ ధరలను అంతకంతకూ పెంచుతోంది. తెలుగు రాష్ట్రాలలో గ్యాస్ సిలిండర్ ధరలు 950 రూపాయలకు అటూఇటుగా ఉన్నాయి. పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల వల్ల ప్రజలపై భారం కూడా పెరుగుతోంది.

అయితే గ్యాస్ సిలిండర్ వాడేవాళ్లలో చాలామందికి గ్యాస్ సిలిండర్లకు ఎక్స్ పైరీ డేట్ ఉంటుందని భావిస్తారు. సాధారణంగా సిలిండర్లపై ఏ, బీ, సీ, డీ అనే లెటర్స్ ఉంటాయి. సిలిండర్ పై ఉండే ఈ అక్షరాలు నెలలను సూచిస్తాయి. సిలిండర్లపై ఏ అనే లెటర్ ఉంటే జనవరి నుంచి మార్చి వరకు అని బీ అని ఉంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు అని గుర్తుంచుకోవాలి. సీ అని ఉంటే జులై నుంచి సెప్టెంబర్ వరకు అని డీ అని ఉంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అని గుర్తు పెట్టుకోవాలి.
Also Read: వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు శుభవార్త.. రూ.155కే అపరిమిత కాల్స్?
ఈ లెటర్స్ ఎక్స్‌పైరీ డేట్ కాకపోయినా మ్యాండేటరీ టెస్ట్స్ డ్యూ డేట్ అని చెప్పుకోవచ్చు. సిలిండర్ల సాధారణ లైఫ్ 15 సంవత్సరాలు కాగా కంపెనీలు రెండుసార్లు గ్యాస్ సిలిండర్లకు పరీక్షలు నిర్వహిస్తాయి. ఈ పరీక్షలలో పాస్ అయిన సిలిండర్లను కొనసాగించి ఫెయిల్ అయిన సిలిండర్లను నాశనం చేయడం జరుగుతుంది. సిలిండర్ పై ఏ 26 అని ఉంటే 2026 సంవత్సరం జనవరి నుంచి మార్చి మధ్యలో ఆ సిలిండర్ ను తనిఖీ చేస్తారని అర్థం.
అందువల్ల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ఎక్స్‌పైరీ డేట్ గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గ్యాస్ సిలిండర్లను తరచుగా వాడేవాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకుంటే మంచిది.
Also Read: ఈ-శ్రమ్ కార్డ్ ఉన్నవాళ్లకు శుభవార్త.. రూ.2 లక్షల బెనిఫిట్?