Homeబిజినెస్Realme C83 Launch India 2026: అధికారికంగా మార్కెట్లోకి వచ్చిన Realme C83.. ధర బడ్జెట్...

Realme C83 Launch India 2026: అధికారికంగా మార్కెట్లోకి వచ్చిన Realme C83.. ధర బడ్జెట్ లోపే..

Realme C83 Launch India 2026: మొబైల్ కొనాలని అందరికీ ఉంటుంది. కానీ మిడ్ రేంజ్ పీపుల్స్ ఎప్పుడూ బడ్జెట్లో ఫోన్ కొనాలని అనుకుంటూ ఉంటారు. ఇలాంటి వారి కోసం కొన్ని కంపెనీలు తక్కువ ధరకే ఆకర్షణీయమైన ఫీచర్లు ఉండే మొబైల్స్ ను మార్కెట్ లోకి తీసుకువస్తూ ఉంటాయి. లేటెస్ట్ గా రియల్ మీ కంపెనీ 2026 మార్చి ఆరవ తేదీన కొత్త ఫోను ను అధికారికంగా ప్రారంభించింది. దీని ధర సామాన్యులకు అందుబాటులో ఉండడమే కాకుండా ఇందులో కెమెరా, బ్యాటరీ పనితీరు కూడా మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. దీని గురించి పూర్తి వివరాలు లోకి వెళ్తే..

Also Read: తెలుగు రాష్ట్రాల్లో ‘ధురంధర్ 2 ‘ కి బయ్యర్స్ కరువు.. కారణం ఏంటంటే!

కొత్తగా మార్కెట్లోకి వచ్చిన Realme C83 5G అనే మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే.. ఇందులో 6.8 అంగుళాల LCD స్క్రీన్ తో కలిగి ఉంది. ఇది 144 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. 900 nits బ్రైట్నెస్ తో పనిచేసే ఈ మొబైల్లో మీడియాటిక్ డైమెన్సిటీ 6300 5G చిప్ సెట్ ఉంటుంది. దీంతో రోజువారి వినియోగదారులతో పాటు గేమింగ్ కోరుకునే వారికి ఇది బాగా పనిచేస్తుంది. ఈ మొబైల్లో బ్యాటరీ వేరే లెవెల్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు రియల్ మీ మొబైల్స్ లో లేని బ్యాటరీ ఇందులో ఉంది. ఈ మొబైల్లో 7,000 mAh బ్యాటరీని అమర్చారు. ఈ బ్యాటరీ 15 w ఫాస్టెస్ట్ చార్జింగ్తో సపోర్ట్ చేస్తుంది. అలాగే 5W వైర్డ్ రివర్స్ చార్జింగ్ కూడా సపోర్ట్ చేయనుంది.

ఇందులో కెమెరా పనితీరు కూడా మెరుగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మొబైల్ లో 13 MP ప్రైమరీ కెమెరాను అమర్చారు. ఇది AI తరహాలో ఫోటోలను స్నాప్ చేస్తుంది. అలాగే 5 MP సెల్ఫీతో పాటు వీడియో కాలింగ్ కోసం కూడా పనిచేస్తుంది. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లతోపాటు సోషల్ మీడియా కంటెంట్ సృష్టించే వారికి ఈ ఫోన్ ఫుల్ సపోర్ట్ గా ఉండనుంది. ఇక ఇందులో UI 7.0 బేసుడు ఆన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత సాఫ్ట్వేర్ ఉండడంతో కావలసిన యాప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఒకేసారి పలు రకాల యాప్స్ ఉపయోగించినా కూడా ఫోన్ ఎలాంటి వేగం తగ్గకుండా ఉంటుంది. ఇందులో IP 64 రేటింగ్ durability కలిసి ఉంది.

ఈ మొబైల్ 4gb ర్యామ్ 64 జిబి స్టోరేజ్ తో రూ.13,499 ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. టాప్ ఎండ్ వేరియంట్ 6GB రామ్ 128 GB స్టోరేజ్ కావాలనుకుంటే రూ.17,499 ధరతో విక్రయిస్తున్నారు. ఇది మార్కెట్లోకి వచ్చి ఇప్పటికే అందుబాటులో ఉన్న POCO M7 మొబైల్ కు గట్టి పోటీ ఇవ్వనుంది. ఎందుకంటే ఇంచుమించు ఆ ఫోన్ తరహా లోనే ఈ కొత్త రియల్ మీ C83 మొబైల్ ను చూడవచ్చు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version