Dreams: మనం నిద్రలో ఉన్నప్పుడు చాలా కలలు వస్తుంటాయి. వాటిలో కొన్ని నిజంగానే జరుగుతాయని చాలా మంది భావిస్తారు. మరికొందరు మాత్రం ట్రాష్ అని కొట్టిపారేస్తారు. అయితే మనకు నిద్రలో వచ్చే కలల వెనుక మన జీవితానికి సంబంధించిన విషయాలు దాగి ఉంటాయని పరిశోధకులు సూచిస్తున్నారు. అందుకే కొన్ని కలలు శుభాన్ని కలిగిస్తే.. మరికొన్ని కలలు ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయని వారు వివరిస్తున్నారు.

కొంతమంది కలలో బిచ్చగాడిని చూడటం, ఎవరైనా అడుక్కున్నట్లు కనిపిస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా? కలలో మీకు బిచ్చగాడు కనిపించినా.. ఎవరైనా భిక్ష పెడుతున్నట్లు అనిపించినా మీరు భవిష్యత్‌లో పెద్ద ఆస్తిని పొందడానికి సూచిక అని స్వప్న శాస్త్రం చెప్తున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. అందుకే కలలో బిచ్చగాళ్ల గుంపు కనిపించిన వారు వ్యక్తిగత జీవితంలో నిరాశ్రయులకు తగిన సహాయం అందించాలనే విషయానికి సంకేతంగా భావించాలని చెప్తున్నారు.
Also Read: Chinajiyar Swamy: కేసీఆర్ తో గ్యాప్.. సమ్మక్క-సారక్క వివాదంపై చినజీయర్ స్వామి హాట్ కామెంట్స్
కలలో మీరు యాచకుడు లేదా వృద్ధులు లేదా అనాథ పిల్లలకు సహాయం చేస్తే.. రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఏదో మార్పు జరుగుతుందని అర్థం. ఒకవేళ మీరు ఆర్థిక సంక్షోభంలో ఉంటే త్వరలోనే ఆ కష్టాల నుంచి బయటపడతారని సంకేతంగా భావించవచ్చు. మీరు ఏదైనా వ్యాధితో బాధపడుతుంటే త్వరలో ఆ వ్యాధి నుంచి కోలుకుని ఆరోగ్యవంతులుగా మారతారని అర్థం.
ఒకవేళ మీరు బిచ్చం అడుగుతున్నట్లు కలలో కనిపించినా మీకు మంచే జరుగుతుందని స్వప్న శాస్త్రం వివరిస్తోంది. ఇలాంటి వారికి ఆనందం, శ్రేయస్సు, గౌరవం లభిస్తుందని స్వప్న శాస్త్రం చెబుతోంది. కాగా పురాతన కాలంలో బిచ్చగాళ్లను దేవుడు సంచరించినట్లుగా భావించేవారు. అందుకే పేదలకు అన్నదానం చేయడమే తమ కర్తవ్యమని చాలామంది విశ్వసించేవారు. ఎందుకంటే బిచ్చగాడికి దానం ఇస్తే దేవుడికి దానం చేసినట్లే అనే నమ్మకం ఉండేది. చాలా మంది సంపన్న వ్యాపారులు బయట భారీ బల్లలు ఏర్పాటు చేసి పేదలకు భోజనం పెట్టేవారు.2) కలలో మీకు బిచ్చగాడు కనిపించాడా? అయితే ఇలా జరగడం ఖాయం

మనం నిద్రలో ఉన్నప్పుడు చాలా కలలు వస్తుంటాయి. వాటిలో కొన్ని నిజంగానే జరుగుతాయని చాలా మంది భావిస్తారు. మరికొందరు మాత్రం ట్రాష్ అని కొట్టిపారేస్తారు. అయితే మనకు నిద్రలో వచ్చే కలల వెనుక మన జీవితానికి సంబంధించిన విషయాలు దాగి ఉంటాయని పరిశోధకులు సూచిస్తున్నారు. అందుకే కొన్ని కలలు శుభాన్ని కలిగిస్తే.. మరికొన్ని కలలు ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయని వారు వివరిస్తున్నారు.
కొంతమంది కలలో బిచ్చగాడిని చూడటం, ఎవరైనా అడుక్కున్నట్లు కనిపిస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా? కలలో మీకు బిచ్చగాడు కనిపించినా.. ఎవరైనా భిక్ష పెడుతున్నట్లు అనిపించినా మీరు భవిష్యత్‌లో పెద్ద ఆస్తిని పొందడానికి సూచిక అని స్వప్న శాస్త్రం చెప్తున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. అందుకే కలలో బిచ్చగాళ్ల గుంపు కనిపించిన వారు వ్యక్తిగత జీవితంలో నిరాశ్రయులకు తగిన సహాయం అందించాలనే విషయానికి సంకేతంగా భావించాలని చెప్తున్నారు.
కలలో మీరు యాచకుడు లేదా వృద్ధులు లేదా అనాథ పిల్లలకు సహాయం చేస్తే.. రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఏదో మార్పు జరుగుతుందని అర్థం. ఒకవేళ మీరు ఆర్థిక సంక్షోభంలో ఉంటే త్వరలోనే ఆ కష్టాల నుంచి బయటపడతారని సంకేతంగా భావించవచ్చు. మీరు ఏదైనా వ్యాధితో బాధపడుతుంటే త్వరలో ఆ వ్యాధి నుంచి కోలుకుని ఆరోగ్యవంతులుగా మారతారని అర్థం.
ఒకవేళ మీరు బిచ్చం అడుగుతున్నట్లు కలలో కనిపించినా మీకు మంచే జరుగుతుందని స్వప్న శాస్త్రం వివరిస్తోంది. ఇలాంటి వారికి ఆనందం, శ్రేయస్సు, గౌరవం లభిస్తుందని స్వప్న శాస్త్రం చెబుతోంది. కాగా పురాతన కాలంలో బిచ్చగాళ్లను దేవుడు సంచరించినట్లుగా భావించేవారు. అందుకే పేదలకు అన్నదానం చేయడమే తమ కర్తవ్యమని చాలామంది విశ్వసించేవారు. ఎందుకంటే బిచ్చగాడికి దానం ఇస్తే దేవుడికి దానం చేసినట్లే అనే నమ్మకం ఉండేది. చాలా మంది సంపన్న వ్యాపారులు బయట భారీ బల్లలు ఏర్పాటు చేసి పేదలకు భోజనం పెట్టేవారు.
Also Read: CM Jagan Election 2024: రాబోయే ఎన్నికలే లక్ష్యం.. ప్రజలతో మమేకం కావాలని జగన్ పిలుపు