Mohan Babu Birthday Special Story: మోహన్ బాబు.. తెరపై విలక్షణ నటుడు. కలెక్షన్ కింగ్. తన నటనతో నవ్వించడమూ తెలుసు.. ఏడిపించడమూ తెలుసు. నటుడిగా.. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా.. నిర్మాతగా.. విద్యావేత్తగా.. రాజకీయ నాయకుడిగా.. ఇలా అన్ని చవిచూసి మెప్పించిన నటుడు ఆయన. 47 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్న మోహన్ బాబు ఎంతో కష్టపడి పైకి ఎదిగారు. కష్టం విలువ తెలిసిన నటుడు ఆయన. ఎక్కడో రాయలసీమలోని ఒక మారుమూల గ్రామం నుంచి ఇండస్ట్రీకి వచ్చాడు భక్సవత్సలం నాయుడు. ఆ తర్వాతే దాసరి నారాయణ రావు దయతో ‘మోహన్ బాబు’గా మారాడు.
చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మోదుగులపాళెంలో 1952 మార్చి 19న మోహన్ బాబు జన్మించాడు. తండ్రి ఉపాధ్యాయుడు. ఆయనకు ముగ్గురు తమ్ముళ్లు. ఒక సోదరి ఉన్నారు. మోహన్ బాబు ఏర్పేడు, తిరుపతిలో జరిగింది. ఈయన చెన్నైలో భౌతిక శాస్త్రంలో డిగ్రీని పూర్తి చేశారు. సినీ రంగంలో ప్రవేశించడానికి ముందు కొంతకాలం వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆయన పుట్టినరోజును అభిమానులు పండుగలా చేసుకుంటున్నారు. ఆయన విద్యాలయాల్లో విద్యార్థులంతా మోహన్ బాబు గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
Also Read: కేసీఆర్ తో గ్యాప్.. సమ్మక్క-సారక్క వివాదంపై చినజీయర్ స్వామి హాట్ కామెంట్స్
-సినీ ప్రస్థానం
1970లో మోహన్ బాబు అర్ధదశాబ్ధం పాటు దర్శకత్వ విభాగంలో సినీ కెరీర్ ను మొదలుపెట్టారు. దాసరి నారాయణరావు తెరకెక్కించిన చిత్రంలో అవకాశం దక్కించుకొని మోహన్ బాబు నటుడు అయ్యాడు. సినీ ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలుపెట్టాడు. 1975 నవంబర్ 22న దాసరి నారాయణరావు తెరకెక్కించిన ‘స్వర్గం నరకం’ సినిమాతో నటుడిగా పరిచయం అయ్యాడు. కెరీర్ తొలినాళ్లలో మోహన్ బాబు విలన్ గా నటించాడు. తన మార్క్ విలనిజంతో మెప్పించాడు. విలన్ కు ఒక స్టైల్, మేనరిజమ్స్ అలవాటు చేసిన నటుడు ఒక్క మోహన్ బాబు మాత్రమే. 80వ దశకంలో విడుదలైన సినిమాల్లో మోహన్ బాబు విలన్ గా కనిపించారు. అగ్రహీరోలు, అప్పటి యువ హీరోలు అందరితోనూ నటించారు.
అన్న ఎన్టీఆర్ తో ‘మేజర్ చంద్రకాంత్’ మూవీ మోహన్ బాబు కెరీర్ లో ప్రత్యేకం. పెదరాయుడు, శ్రీరాములయ్య, అడవిలో అన్న లాంటి సినిమాలు మోహన్ బాబు స్థాయిని పెంచాయి. ‘లక్ష్మీప్రసన్న పిక్చర్స్’ స్థాపించి 50కి పైగా చిత్రాలను మోహన్ బాబు నిర్మించారు.
శ్రీవిద్యానికేతన్ సంస్థల అధినేతగా మోహన్ బాబు రాణిస్తున్నారు. విద్యారంగంలోనూ ఆయన సక్సెస్ అయ్యారు.
90వ దశకంలో ‘అల్లుడు గారు’ సినిమాతో మళ్లీ హీరో అయ్యాడు. అక్కడి నుంచి స్టార్ హీరోగా ఎదిగాడు. బ్రహ్మ, పెదరాయుడు, అల్లరి మొగుడు, అడవిలో అన్న లాంటి ఎన్నో సంచలన సినిమాలతో సత్తా చూపించారు. సురేష్ కృష్ణ దర్శకత్వంలో ‘రాయలసీమ రామన్న చౌదరి’ చిత్రం మోహన్ బాబు కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచింది. అదే ఆయనకు 500 సినిమా కావడం విశేషం.
చాలా రోజులు సినిమాలకు దూరంగా ఉన్న మోహన్ బాబు అప్పట్లో ‘యమదొంగ’, ఇటీవల ‘సన్నాఫ్ ఇండియా’ సినిమాలో నటించారు.
కేంద్రం నుంచి పద్మశ్రీ పురస్కారం అందుకున్న మోహన్ బాబు.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి రాజ్యసభ ఎంపీగానూ చేశారు. గత ఎన్నికల్లోనూ వైసీపీకి మద్దతుగా నిలిచారు. బీజేపీతోనూ సఖ్యతతో మెలుగుతున్నారు. ప్రస్తుతం ‘శాకుంతలం’, ‘ఆదిపురుష్’ సినిమాలో మోహన్ బాబు కీలక పాత్రలు పోషిస్తున్నట్టు సమాచారం.
Also Read: రాబోయే ఎన్నికలే లక్ష్యం.. ప్రజలతో మమేకం కావాలని జగన్ పిలుపు