Empty Stomach: మనం తినే ఆహారాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రొటీన్లు, విటమిన్లు ఉన్న ఆహారాలు తీసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నాం. దీంతో మనం కొన్ని ఆహారాలను ఉదయం పరగడుపున తీసుకుంటే వచ్చే నష్టాల గురించి తెలుసుకోవడం లేదు. ఫలితంగా వాటిని తిని మన ఆరోగ్యాన్ని దెబ్బతినేలా చేసుకుంటున్నాం. వాటి గురించి తెలిస్తే ఇక మీదట పరగడుపున వాటిని తినేందుకు ముందుకు రాకుండా ఉంటేనే మేలు. ఈ నేపథ్యలో అవి ఏంటో తెలుసుకుందాం.
స్వీట్లు
ఉదయం పరగడుపున తియ్యని తినుబండారాలు తినడం మంచిి కాదు. ఇందులో ఉండే చక్కెర స్థాయిలు మనల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి. ఇన్సులిన్ స్థాయిలను పెంచుతాయి. ఫ్రాంక్రియాస్ గ్రంథికి హాని కలిగిస్తాయి. అందుకే వీటికి ఉదయం దూరంగా ఉండాలి. లేకపోతే మన ఆరోగ్యం మీద ప్రభావం పడుతుంది. స్వీట్లలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది.
సిట్రస్ పండ్లు
పుల్లగా ఉండే పండ్లు సిట్రస్ పండ్లు. ఇందులో నిమ్మ, నారింజ, ఉసిరి, ద్రాక్ష వంటివి వస్తాయి. ఖాళీ కడుపుతో వీటిని తింటే ఇందులో ఉండే ఫైబర్, ఫ్రక్టోజ్ జీవక్రియలను నెమ్మదిగా ఉండేలా చేస్తాయి. గుండెలో మంటలు కలిగేందుకు దోహదపడుతాయి. అందుకే సిట్రస్ పండ్లను ఉదయం సమయంలో తీసుకోవడం సురక్షితం కాదు.
మిరపకాయలు
ఉదయ సమయంలో కారం ఎక్కువగా తినొద్దు. ఖాళీ కడుపుతో కారం తింటే మండుతుంది. ఇందులో ఉండే ఆమ్ల ప్రిచర్యలు, తిమ్మిర్లు జీర్ణ సంబంధ సమస్యలకు కారణమవుతాయి. ఆరోగ్యాన్ని ఇబ్బందికరంగా చేస్తాయి. ఖాళీ కడుపుతో వీటిని తీసుకోవడం మంచిది కాదు. ఎప్పుడైనా కారంతో చేసినవి మధ్యాహ్నమే తినేందుకు చొరవ తీసుకోవాలి.
కాఫీ
చాలా మందికి ఉదయం లేవగానే టీ, కాఫీ తాగడం అలవాటు. అందులో ప్రొటీన్లు సున్నా. అయినా ఎందుకో ఆ అలవాటును మార్చుకోలేకపోతున్నారు. ఉదయం టీ, కాఫీ తాగడం వల్ల ఎసిడిటి సమస్య ఏర్పడుతుంది. కాఫీ తీసుకోక ముందే ఇంకా ఏదైనా తిన్నాక తాగడం మంచిది. కానీ పరగడుపున కాఫీ తాగడం సురక్షితం కాదు.