https://oktelugu.com/

NTR Second Son: రెండో కొడుకు అంటే ఎన్టీఆర్ కి అసలు ఇష్టం ఉండదా? కారణం తెలిస్తే చాలా ఫీల్ అవుతారు!

దైవ నిర్ణయాన్ని ఎవరూ కాదనలేరు కాబట్టి ఇద్దరు కొడుకులను ఎన్టీఆర్ ప్రేమగా చూసుకుంటున్నారు. ఇటీవల పెద్ద కొడుకు అభయ్ రామ్ కి సినిమా ఆఫర్ వచ్చిందన్న ప్రచారం జరిగింది.

Written By:
  • Shiva
  • , Updated On : May 5, 2023 / 11:36 AM IST
    Follow us on

    NTR Second Son: జూనియర్ ఎన్టీఆర్ ది కంప్లీట్ లైఫ్ అని చెప్పొచ్చు. ఆయన టాలీవుడ్ టాప్ స్టార్. అశేష అభిమానగణం ఆయన వెంట ఉంది. వీటితో పాటు చక్కని ఫ్యామిలీ ఎన్టీఆర్ సొంతం. 2011లో చుట్టాలమ్మాయి లక్ష్మీ ప్రణతిని ఎన్టీఆర్ వివాహం చేసుకున్నారు. లక్ష్మీ ప్రణతి చాలా హోమ్లీగా ఉంటారు. పెళ్ళైన వెంటనే ఫ్యామిలీ ప్లానింగ్ చేశారు. వీరికి ఇద్దరు సంతానం. ఎన్టీఆర్ కి ఇద్దరూ కొడుకులే కాగా అభయ్ రామ్, భార్గవ్ రామ్ వారి పేర్లు. అయితే చిన్న కొడుకు భార్గవ్ రామ్ జన్మించినప్పుడు ఎన్టీఆర్ చాలా వేదనకు గురయ్యాడట.

    అందుకు ఒక బలమైన కారణం ఉంది. ఎన్టీఆర్-లక్ష్మీ ప్రణతిలకు పెద్దబ్బాయి అభయ్ రామ్ పుట్టినప్పుడు చాలా సంతోషంగా ఉన్నారట. రెండో సంతానంగా అమ్మాయిని కోరుకున్నారట. అమ్మాయి పుడితే అల్లారు ముద్దుగా పెంచుకోవాలని ఆశపడ్డారట. మళ్ళీ అబ్బాయి పుట్టడంతో ఎన్టీఆర్ దంపతుల ఆశలు ఆవిరయ్యాయట. మూడో సంతానం కనలేరు కాబట్టి. అమ్మాయి కావాలన్న వారి కల కలగానే ఉండిపోయిందట. ఆ కారణంగా భార్గవ్ రామ్ జననం ఎన్టీఆర్ ని ఒకింత బాధకు గురి చేసిందట.

    దైవ నిర్ణయాన్ని ఎవరూ కాదనలేరు కాబట్టి ఇద్దరు కొడుకులను ఎన్టీఆర్ ప్రేమగా చూసుకుంటున్నారు. ఇటీవల పెద్ద కొడుకు అభయ్ రామ్ కి సినిమా ఆఫర్ వచ్చిందన్న ప్రచారం జరిగింది. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన శాకుంతలం మూవీలో బాలభరతుడు పాత్రకు మొదట అభయ్ రామ్ ని అనుకున్నారట. దర్శకుడు గుణశేఖర్ ఎన్టీఆర్ ని రిక్వెస్ట్ చేశాడట. అయితే ఎన్టీఆర్ సున్నితంగా తిరస్కరించారట. తర్వాత ఆ పాత్రను అల్లు అర్జున్ కూతురు అర్హ చేత చేయించారు.

    అల్లు అర్హ ఆ పాత్ర చక్కగా చేశారు. మరోవైపు ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. విడుదలకు ఏడాది సమయం మాత్రమే ఉండగా నిరవధికంగా షూటింగ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ లో ఎన్టీఆర్ కి జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కానుంది. సైఫ్ అలీ ఖాన్ మెయిన్ విలన్ రోల్ చేస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.