House Cleaning: ప్లాస్టిక్, ప్లాస్టిక్, ప్లాస్టిక్ ఎవరి ఇంట్లో చూసినా ఎక్కడ చూసినా ప్లాస్టిక్ నే ఎక్కువ వాడుతున్నారు. కిచెన్ లో అయితే చాలా మంది ప్లాస్టిక్ డబ్బాలనే వాడుతున్నారు. ఫ్రిజ్ లో ఉంచే కూరగాయల కోసం కూడా ప్లాస్టిక్ డబ్బాలనే వాడుతున్నారు. మరి వీటి వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయో తెలుసా? ఇంతకీ ఈ ప్లాస్టిక్ డబ్బాలను ఎన్ని రోజులు వాడాలి? అసలు ఉపయోగించాలా? వద్దా? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
బ్యాక్టీరియా ఉండకూడదు అని ఇల్లును నిత్యం క్లీన్ గా ఉంచుకుంటారు. టీవీ, ప్రిజ్, కిచెన్, బాత్ రూమ్ వంటి చాలా ప్లేస్ లలో ఈ బ్యాక్టీరియా నిత్యం తిష్ట వేసుకొని ఉంటుంది. ఇక వీటిని ఆసిడ్, ఇతర లిక్విడ్ లు వేసి క్లీన్ చేసి శుభ్రం చేసినా సరే ఇంట్లో ఉండే బ్యాక్టీరియాలు మాత్రం కచ్చితంగా ఉంటాయి. అయితే కొన్ని వస్తువులను మీరు ఛేంజ్ చేస్తూ ఉంటారు కావచ్చు కానీ.. బెడ్, పరుపు, దిండ్లు, వంటింట్లో వాడే ప్లాస్టిక్ డబ్బాలు వంటివి కంటిన్యూగా సంవత్సరాల తరబడి వాడుతున్నారా?
ఇంట్లో వాడే దిండ్లు, దుప్పట్లు, ప్లాస్టిక్ డబ్బాలను రెండు సంవత్సరాలకు మించి అసలు వాడకూడదు అంటారు నిపుణులు. దిండ్లు, దుప్పట్లలో చెమట పేరుకొని పోయి ఉంటుందట. ఉతికినా కూడా ఇందులో ఉండే బ్యాక్టీరియా అలాగే ఉంటుందట. దీనివల్ల చర్మ సమస్యలు వస్తాయట. అయితే మీరు కనుక ఎక్కువ కాలం దిండ్లు వాడాలి అనుకుంటే..కచ్చితంగా వాటికి ప్రొటెక్టర్లను వాడాల్సిందే. వాటిని కూడా రెగ్యులర్ గా ఉతుకుతూ ఉండాలి. దిండ్లు, దుప్పట్లను ఉతికినట్టు పరుపులను ఉతకడం కుదరదు. ఇందులో కూడా చాలా బ్యాక్టీరియా ఉంటుంది.
20 సంవత్సరాల వరకు కూడా కొందరు ఈ పరుపులను మార్చకుండా ఒకేటే ఉపయోగిస్తుంటారు. కానీ 7 నుంచి 10 సంవత్సరాల మధ్యలో వాటిని మార్చాలి అంటున్నారు నిపుణులు. ఇక టవల్స్ ను కూడా మారుస్తూనే ఉండాలి. వీటిని శుభ్రం చేస్తూనే వాడాలి. ఇక కిచెన్ లో స్పాంజ్ లను వాడుతుంటారు. ఇందులో కూడా చాలా బ్యాక్టీరియా ఉంటుంది. ఇక ప్లాస్టిక్ డబ్బాలను కూడా రెండు లేదా మూడు సంవత్సరాలకు మారుస్తూనే ఉండాలి. వీటిలో బ్యాక్టీరియా ఎక్కువ తయారు అవుతుంది. అంతేకాదు ఇవి వాతావరణానికి హానీ చేస్తాయి. వీటికి బదులు స్టెయిన్ లెస్ స్టీల్ డబ్బాలను వాడటం ఉత్తమం.