https://oktelugu.com/

VastuTips: ఇది ఇంట్లో ఉంటే దు:ఖమే ఉండదు..

వాస్తు శాస్ట్రంలో కర్పూరం పదార్థానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కర్పూరం అనగానే దేవుడి ముందు దీపం వెలిగించేందుకు ఉపయోగించే వస్తువు అనుకుంటాం. కానీ దీని వల్ల మనుషుల జీవితాల్లో అనేక మార్పులు ఉంటాయని చాలా మందికి తెలియదు.

Written By:
  • Srinivas
  • , Updated On : April 23, 2024 / 04:01 PM IST

    vastu-tips-in-telugu

    Follow us on

    VastuTips: ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, దు:ఖం రెండూ ఉంటాయి. కానీ కొందరు ఎప్పుడూ సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. దీంతో తమ కష్టాల నుంచి గట్టెక్కించాలని దేవుడిని ప్రార్థిస్తూ ఉంటారు. అయితే ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ వల్ల కూడా నిత్యం సమస్యలతో బాధపడుతూ ఉంటారు. నెగెటివ్ ఎనర్జీని కనుగ వెళ్లగొడితే మనశ్శాంతి ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం దీనిని నుంచి బయటపడడానికి ఎన్నో మార్గాలున్నాయి. కానీ నిత్యం అందుబాటులో ఉండే ఈ వస్తువు ఉంటే ఇంట్లో సమస్యలు మాయమవుతాయని కొందరు వాస్తు శాస్త్ర నిపుణుల చెబుతున్నారు.

    వాస్తు శాస్ట్రంలో కర్పూరం పదార్థానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కర్పూరం అనగానే దేవుడి ముందు దీపం వెలిగించేందుకు ఉపయోగించే వస్తువు అనుకుంటాం. కానీ దీని వల్ల మనుషుల జీవితాల్లో అనేక మార్పులు ఉంటాయని చాలా మందికి తెలియదు. ఇంట్లో కర్పూరం ఉండడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కర్పూరం ప్రతికూల శక్తిని పారద్రోలుతుంది. దీనిని నీటలో కలిపి ఇల్లంతా చల్లడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుందని అంటారు. కర్పూరం నీళ్లు చల్లడం వల్ల కొన్ని క్రిమీ కీటకాలు కూడా చనిపోతాయి.

    వాస్తు శాస్త్రం మాత్రమే కాకుండా జ్యోతిష్య శాస్త్రంలో కర్పూరానికి ప్రాధాన్యత ఉంది. కొన్ని గ్రహాల మార్పు కారణంగా మనుషుల జీవితాల్లో కష్టాలు ఏర్పడుతాయి. కర్పూరాన్ని ఉపయోగించి పూజ చేయడం వల్ల వారి గ్రహాల స్థితి మారే అవకాశం ఉందని కొందరు పండితులు అంటున్నారు. అంతేకాకుండా కర్పూరం నీళ్లు ఇంట్లో చల్లడం వల్ల మనశ్శాంతి ఉంటుంది. ఎన్ని కష్టాలున్నా వాటిని తట్టుకునే శక్తి వస్తుంది.

    ఇంట్లోనే కాకుండా ఇంటి గేటు బయట కర్పూరం నీళ్లు చల్లడం వల్ల ఎటువంటి దుష్ట శక్తి లోపలికి రాకుండా ఉంటుంది. కర్పూరాన్ని వెలిగించడం వల్ల ఆ ప్రదేశంలో ఎటువంటి శక్తులు ఉన్నా పారిపోతాయి. కర్పూరం బలమైన సుగంధ స్పటికార పదార్థం. ఇది ఇచ్చే సువాసన వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది.