Ind W Vs Aus W: భారత మహిళ క్రికెట్ జట్టు సారథి హర్మన్ ప్రీత్ కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత ఏడాది జరిగిన మహిళల వన్డే వరల్డ్ కప్ లో టీమిండియాను ఆమె విజేతగా నిలిచింది. బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాలలో సత్తా చూపించిన ఆమె.. సారధిగా కూడా అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంది.
ఆమె తీసుకొన్న నిర్ణయాల వల్ల భారత జట్టు విజేతగా నిలిచింది. అంతేకాదు భారత మహిళా క్రికెట్ చరిత్రలో తొలిసారిగా వరల్డ్ కప్ అందుకొని.. సరికొత్త రికార్డు సృష్టించింది.
హర్మన్ నాయకత్వంలో టీమిండియా ప్రస్తుతం వరుస విజయాలు సాధిస్తోంది. హర్మన్ ఆధ్వర్యంలోని టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. 3 t20 లు, మూడు వన్డేలు, ఒక టెస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియా తో ఆడుతుంది…
టి20 సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్ చేసింది.. 18 ఓవర్లలో 133 పరుగులకు ఆల్ అవుట్ అయింది.
ఆస్ట్రేలియా జట్టులో Georgia Wareham 30 పరుగులు చేసింది. లిచ్ ఫీల్డ్ 26 పరుగులతో ఆకట్టుకుంది. టీమిండియా బౌలర్లలో అరుంధతి రెడ్డి 4 వికెట్లు సొంతం చేసుకుంది. రేణుక సింగ్ రెండు వికెట్లు దక్కించుకుంది. శ్రీచరణీ కూడా 2 వికెట్లు పడగొట్టింది.
ఈ మ్యాచ్ ప్రారంభం నుంచి టీమ్ ఇండియా బౌలర్లు అదరగొట్టారు. 22 పరుగుల వద్ద ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. 27 పనుల వద్ద రెండో వికెట్ నష్టపోయింది. ఈ దశలో మూడో వికెట్ కు కాస్త మెరుగైన భాగస్వామ్యం నమోదు చేసినప్పటికీ.. ఆ తర్వాత ఆస్ట్రేలియా క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది.
ఈ మ్యాచ్లో టీమిడియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అద్భుతమైన క్యాచ్ పట్టింది. ఫెర్రీ (20) అరుంధతి రెడ్డి బౌలింగ్లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించింది. ఆ బంతి గాల్లో ఎగిరింది. అసాధ్యమైన ఆ క్యాచ్ ను హర్మన్ అద్భుతంగా అందుకుంది.
మహిళల వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా పై కూడా హర్మన్ ప్రీత్ కౌర్ ఇలాంటి ఫీల్డింగ్ విన్యాసాన్ని ప్రదర్శించింది. చివరి వికెట్ హర్మన్ ప్రీత్ కౌర్ పట్టిన క్యాచ్ ద్వారా లభించడంతో టీమిండియా వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. ఇప్పుడు ఆ ఫీల్డింగ్ విన్యాసాన్ని మరిపించే విధంగా హర్మన్ క్యాచ్ పట్టడం విశేషం.
WHAT A CATCH BY CAPTAIN HARMANPREET KAUR…!!!
– She has taken a Stunning Catch to dismiss Perry. pic.twitter.com/lCYMh024p9
— Johns. (@CricCrazyJohns) February 15, 2026