Homeఅంతర్జాతీయంMahesh Babu: షాకింగ్: మహేష్ బాబు మసాలా తింటే పైకి పోతారట.. నిషేధించిన ప్రభుత్వం..

Mahesh Babu: షాకింగ్: మహేష్ బాబు మసాలా తింటే పైకి పోతారట.. నిషేధించిన ప్రభుత్వం..

Mahesh Babu: టాలీవుడ్ అగ్ర నటుడు మహేష్ బాబు ప్రచారకర్తగా వ్యవహరించే ఎవరెస్ట్ కంపెనీకి సంబంధించిన మసాలాను ఇటీవల సింగపూర్ దేశం నిషేధం విధించింది. దానిని మర్చిపోకముందే హాంకాంగ్ దేశం కూడా బ్యాన్ చేసింది. ఈ మసాలాను మన దేశానికి చెందిన ఎండీహెచ్ ప్రైవేట్ లిమిటెడ్, ఎవరెస్ట్ ఫుడ్ ప్రోడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు తయారుచేస్తాయి. ఈ రెండు కంపెనీలకు సంబంధించిన మసాలాలను నిషేధిస్తున్నట్టు హాంకాంగ్ ప్రకటించింది. ఇటీవల సింగపూర్ దేశానికి చెందిన ప్రభుత్వం ఎవరెస్టు మసాలా దినుసుల్లో ఇథిలిన్ ఆక్సైడ్ మోతాదుకు మించి ఎక్కువగా ఉన్నట్టు తమ పరిశోధనలో తేలిందని ప్రకటించింది. అందువల్లే దాని దిగుమతిని నిలిపివేసినట్టు ప్రకటించింది. ఈ స్థాయిలో ప్రమాదకర వస్తువులను వాడుతున్న ఆ సంస్థపై న్యాయపరంగా చర్యలు తీసుకునేందుకు ఆ దేశం సమాయత్తమైంది.

తాజాగా హాంగ్ కాంగ్ సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ అధారిటీ విభాగం ఏప్రిల్ 5న సాధారణ తనిఖీలు నిర్వహించింది. ఇందులో భాగంగా ఎండీహెచ్ గ్రూప్ తయారుచేసిన కర్రీ పౌడర్, సాంబార్ మసాలా పౌడర్ లో ఇథిలిన్ ఆక్సైడ్ ను గుర్తించామని హాంకాంగ్ ప్రభుత్వం ప్రకటించింది. యౌ సిమ్ మాంగ్ రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన సిమ్ షా సుయ్ లో మూడు ఎండీహెచ్ లే అవుట్ లలో సీఎస్ఎఫ్ తనిఖీలు చేసింది. అందులో మసాలా దినుసులలో పురుగుమందులు ఇథిలిన్ ఆక్సైడ్ ఉన్నట్టు వెళ్లడైంది. దీంతో మసాలా దినుసులు అమ్మకాలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ఎవరెస్ట్ సంస్థ తయారుచేసిన చేపల కూర మసాలా దినుసుల్లోనూ పురుగు మందుల అవశేషాలు గుర్తించినట్టు సీఎస్ఎఫ్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో హాంగ్ కాంగ్, సింగపూర్ దేశాలు మనదేశంలో మసాలా దినుసులు తయారు చేస్తున్న కంపెనీల పై చర్యలకు రంగంలోకి దిగాయి. అంతేకాదు ఆ దినుసుల రీకాల్ కు ఆదేశాలు జారీ చేశాయి. ప్రజలు ఎవరెస్ట్ కంపెనీ తయారు చేస్తున్న ఉత్పత్తులలో వాడొద్దని సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు హాంగ్ కాంగ్ ఫుడ్ సేఫ్టీ విభాగం జారీ చేసిన సూచనలను సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ మరోసారి వివరించింది. ఇథిలిన్ ఆక్సైడ్ ఉన్న ఆహార పదార్థాలను అదేపనిగా తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందట.. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ చేసిన పరిశోధనలో ఈ విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో సింగపూర్, హాంగ్ కాంగ్ ప్రభుత్వాలు ఎవరెస్ట్ తయారు చేస్తున్న మసాలా దినుసులపై నిషేధం విధించాయి. మరి దీనిపై భారత ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి ప్రకటనా చేయలేదు. మరోవైపు ఎవరెస్ట్ కంపెనీ కూడా స్పందించలేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version