Tamalapaku: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏదైనా శుభకార్యం జరిగినా లేదా పూజా కార్యక్రమం జరిగిన తమలపాకులు కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే ఇంటికి వచ్చిన అతిథులకు తమలపాకులను తాంబూలంగా ఇస్తారు. ఇలా తాంబూలంలో తమలపాకులను మాత్రమే ఇవ్వడానికి గల కారణం ఏమిటి? తమలపాకుకు మాత్రమే అంత ప్రాధాన్యత రావడానికి గల కారణం ఏమిటి అనే విషయాలు చాలామందికి తెలియకపోవచ్చు. అయితే హిందూ శాస్త్రం ప్రకారం తమలపాకుకు ఎందుకంత ప్రాధాన్యత ఉందో ఇక్కడ తెలుసుకుందాం…
తమలపాకు గురించి పురాణాలలో ఎన్నో కథలు ఉన్నాయి. హిందువులు తులసి ఆకు తరువాత అంతటి ప్రాధాన్యత కేవలం తమలపాకు మాత్రమే కల్పించారు. అయితే రామాయణం ప్రకారం తమలపాకుకు అంత ప్రాధాన్యత ఎందుకు వచ్చింది అనే విషయానికి వస్తే… రాముడు వనవాసం చేసిన సమయంలో రావణాసురుడు సీతను అపహరించిన సంగతి మనకు తెలిసిందే.ఇక సీతమ్మ జాడని కనుగొన్న హనుమంతుడు సీత దగ్గరకు వెళ్లి తన క్షేమ సమాచారాన్ని రాముడికి తెలియజేయాలంటే గుర్తుగా ఏదైనా ఒక వస్తువు ఇవ్వమని కోరుతాడు.ఇలా సీత తను అక్కడ సంతోషంగా ఉన్నానని చెప్పడానికి సంకేతంగా వస్తువు కోసం వెతుకుతున్న సమయంలో అక్కడే ఉన్నటువంటి ఒక తమలపాకును తీసి హనుమంతుడికి ఇచ్చింది.
Also Read: శివుడికి ఉమ్మెత్త పువ్వులతో పూజ చేయడం వల్ల ఎలాంటి శుభాలు కలుగుతాయో తెలుసా?
ఇలా అప్పటి నుంచి ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు సంతోషానికి గుర్తుగా తమలపాకులను ఇవ్వడం సాంప్రదాయంగా మారింది. అదేవిధంగా మహాభారతంలో యుద్ధానికి వెళ్తున్న సమయంలో అర్జునుడు రాజోగ్య యజ్ఞంలో దుష్ట శక్తుల పై విజయం సాధించిన తరువాత పండితులు యజ్ఞం ప్రారంభించారు. యజ్ఞం ప్రారంభించడానికి మీరు ఒక తమలపాకును పొందమని పండితులు చెప్పడంతో అక్కడ తమలపాకు లేకపోవడం వల్ల అర్జునుడు నాగలోకానికి వెళ్లి అక్కడ నాగరాణినీ అడిగి తమలపాకు పొందాడు. అలా ఆ యజ్ఞం దిగ్విజయంగా పూర్తి అయింది అందుకే ఏదైనా శుభకార్యం చేసే ముందు తాంబూలాలు తీసుకోవటం శుభసూచకంగా పరిగణిస్తారు.
Also Read: ఊసరవెల్లి రంగులు మార్చడం వెనుక అసలు కారణం ఏంటో తెలిస్తే..!