Omicron variant: దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో అంచనాలకు అందని స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఏపీలో గత కొన్నిరోజులుగా ప్రతిరోజూ వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదవుతూ ఉండగా రాష్ట్ర ప్రభుత్వం కరోనా సోకిన వాళ్లకు వైద్య చికిత్స వెంటనే అందేలా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం కరోనా సోకిన వాళ్లలో ఎక్కువమందికి ఒమిక్రాన్ వేరియంట్ సోకుతున్న సంగతి తెలిసిందే.
ఇతర వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వాళ్లలో తీవ్రస్థాయిలో లక్షణాలు కనిపించడం లేదు. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్లకు వైరస్ సోకుతున్నా వైరస్ వాళ్లపై పెద్దగా ప్రభావం చూపడం లేదని తెలుస్తోంది. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ గురించి శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయోగాలలో ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి వస్తుండటం గమనార్హం. ఈ వేరియంట్ లో డెల్టాతో పాటు ఇతర హానికారక వేరియంట్లను నాశనం చేసే శక్తి ఉంది.
Also Read: Omicron In India: ఒమిక్రాన్ తగ్గుతోంది కానీ వేధిస్తున్న ఆ సమస్యలు.. ఏంటంటే?
ఎవరైతే ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడతారో వాళ్లలో గణనీయమైన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ వల్ల వ్యాక్సిన్ తయారీతో పాటు పంపిణీకి సంబంధించి చాలా మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ ను లక్ష్యంగా చేసుకుని శాస్త్రవేత్తలు వ్యాక్సిన్లను తయారు చేయాల్సి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.
ఎవరికైతే ఒమిక్రాన్ వేరియంట్ సోకుతుందో వాళ్లలో వేగవంతమైన ఇమ్యూన్ రెస్పాన్స్ ఉందని శాస్త్రవేత్తలు అన్నారు. ఒమిక్రాన్ సోకి లక్షణాలు తీవ్రంగా ఉంటే మాత్రం ఆస్పత్రిలో చేరితే మంచిదని చెప్పవచ్చు. ఒమిక్రాన్ సోకిన వాళ్లు వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుని మందులు వాడితే త్వరగా కోలుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.
Also Read: Kitchen Tips For Omicron: ఈ వంటింటి చిట్కాలతో ఒమిక్రాన్ నుంచి త్వరగా కోలుకుంటారు..