Debit Cards
Debit Cards : ఇప్పుడున్న కాలంలో చాలామందికి డెబిట్ కార్డులతో పాటు క్రెడిట్ కార్డులు కూడా ఉంటున్నాయి. అయితే వీటి వాడకంలో చాలామంది అవగాహన ఉండడం లేదు. ముఖ్యంగా ఈ కార్డులను జాగ్రత్తపరుచుకోవడంలో పొరపాట్లు చేస్తున్నారు. క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను సాధారణంగా పురుషులు అయితే పర్సులో ఉంచుకుంటారు. కానీ పర్సులు ఎక్కువగా వాడని వారు ఫోన్ వెనకవైపు ఉన్న కవర్లో ఉంచుతూ ఉంటారు. కొందరు ఫోన్ కు ప్రత్యేకంగా పాకెట్ ను ఏర్పాటు చేసుకొని అందులో స్టోర్ చేసుకుంటారు. ఫోన్ ఎప్పటికీ చేతిలో ఉంటుంది గనుక ఫోన్ వెనుకవైపు కార్డులను ఉంచితే మర్చిపోకుండా ఉంటామని భావిస్తారు. అయితే ఫోన్ వెనకాల కార్డులు లేదా డబ్బులు పెట్టడం వల్ల ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయో తెలిస్తే మరోసారి ఇలా చేయరు. ఇంతకీ ఇలా పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే?
Also Read : క్రెడిట్ కార్డులు కావాలా అని కాల్స్ వస్తున్నాయా.. ఎందుకు బ్యాంకు వాళ్లు కాల్స్ చేస్తారంటే?
నేటి కాలంలో కమ్యూనికేషన్ రంగంలో మొబైల్ ప్రధాన వాహకంగా నిలుస్తుంది. కమ్యూనికేషన్ వ్యవస్థ మొత్తం రేడియేషన్ పై ఆధారపడుతూ ఉంటుంది. సమాచారం లేదా ఇంటర్నెట్ సదుపాయం అంతా రేడియేషన్ ద్వారానే వస్తుంది. మొబైల్లో రేడియేషన్ కూడా ఉంటుంది గనక ఒక్కోసారి ఇది అధిక వేడిని కలిగి ఉంటుంది. ఇలా వేడి కలిగిన ఫోన్ వెనకాల డబ్బులు లేదా డెబిట్ క్రెడిట్ కార్డులు ఉండడం వల్ల అవి పాడైపోతాయి. ఫోన్ నుంచి వచ్చే అధిక వేడితో అవి కరిగిపోయే అవకాశం ఉంది. ఒకవేళ ఫోన్ వెనకాల ఇలా డబ్బులు ఉంచినా అవి కాలిపోయే అవకాశం కూడా ఉంది. అందువల్ల ఫోన్ వెనకాల ఇలాంటి ఏర్పాట్లు అస్సలు చేసుకోవద్దని సాంకేతిక నిపుణులు తెలుపుతున్నారు.
డెబిట్, క్రెడిట్ కార్డుల్లో చిన్న చిప్స్ కలిగి ఉంటాయి. ఇవి మొబైల్ వెనకాల ఉంచినప్పుడు ఫోన్ నుంచి వచ్చే వేడితో అవి కరిగిపోయి మొబైల్ కు నష్టానికి కలిగిస్తాయి. దీంతో ఈ చిప్స్ వల్ల మొబైల్ నెట్వర్క్ సరిగా పనిచేయకుండా ఉంటుంది. ఈ కారణంగానే కొన్ని ప్రాంతాల్లో నెట్వర్క్ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల ఫోన్ వెనకాల కార్డులను ఉంచడం మానుకోవాలని చెబుతున్నారు.
ఇక ఫోన్ వెనకాల డెబిట్ క్రెడిట్ కార్డులు లేదా డబ్బులు ఉంచి ఒక్కోసారి అలాగే చార్జింగ్ పెడుతూ ఉంటారు. ఇలా పెట్టడం వల్ల ఫోన్ మరింత వేడిగా మారి ఒక్కోసారి పేలిపోయే అవకాశం కూడా ఉంటుంది. దీంతో కార్డులు పాడవడమే కాకుండా మొబైల్ కూడా పనిచేయకుండా పోతుంది. అందువల్ల సాధ్యమైనంతవరకు కార్డులను ఇతర ప్రదేశాల్లో స్టోర్ చేసుకోవాలి. మొబైల్ వెనకాల ఎలాంటి వస్తువులు ఉంచరాదని సాంకేతిక నిపుణులు తెలుపుతున్నారు.
మొబైల్ వెనకాల కార్డులో ఉంచినప్పుడు ఒక్కోసారి మొబైల్ వెనకాల ఉన్న కవర్ లేదా పాకెట్ పాడైపోయే అవకాశం ఉంటుంది. ఇది గుర్తించినప్పుడు అందులో నుంచి కాడు పడిపోతూ ఉంటాయి. అందువల్ల సాధ్యమైనంత వరకు మొబైల్ వెనకాల కార్డులు ఉంచుకోవడం మానుకోవాలి. ప్రత్యామ్నాయంగా కార్డులను జేబులో లేదా పర్సులో ఉంచుకోవాలని సాంకేతిక నిపుణులు తెలుపుతున్నారు.
Also Read : యూజ్ చేయని క్రెడిట్ కార్డ్స్ ఉండడం మంచిదేనా.. క్లోజ్ చేయడం బెస్టా ?