spot_img
Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan Vijay Deverakonda Multistarrer Movie: పవన్ కళ్యాణ్ మూవీకి డేట్స్ కేటాయించిన విజయ్...

Pawan Kalyan Vijay Deverakonda Multistarrer Movie: పవన్ కళ్యాణ్ మూవీకి డేట్స్ కేటాయించిన విజయ్ దేవరకొండ..? పూర్తి వివరాలు చూస్తే మెంటలెక్కిపోతారు!

Pawan Kalyan Vijay Deverakonda Multistarrer Movie: మరో ఆరు రోజుల్లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) హీరో గా నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) చిత్రం విడుదల కాబోతుంది. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి తో ఒక చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఉగాదికి ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా గురించి ఇప్పటికే సోషల్ మీడియా లో అనేక కథనాలు విన్నాం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కనిపిస్తున్న లుక్ , ఈ చిత్రం కోసమే అని, లుక్ టెస్ట్ కూడా జరిగిందని సోషల్ మీడియా లో వార్తలు వచ్చాయి. అంతే కాకుండా ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ తో పాటు మరో హీరో కూడా నటించే అవకాశాలు ఉన్నాయని. అది విజయ్ దేవరకొండ అయ్యేందుకు ఎక్కువ ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చారు.

Also Read: వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ‘అల్లు సినిమాస్’..తెలుగు వాళ్లంటే అంత చులకనా?

ఇదంతా కేవలం రూమర్స్ మాత్రమే అని అంతా అనుకున్నారు. కానీ నిజంగానే మేకర్స్ విజయ్ దేవరకొండ ని రీసెంట్ గానే సంప్రదించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలో మెయిన్ హీరో రోల్ కాకపోయినప్పటికీ, ఆరంభం నుండి చివరి వరకు విజయ్ దేవరకొండ స్క్రీన్ మీద కనిపిస్తాడని, ఆయన పాత్ర చాలా బలమైనదని అంటున్నారు. డైరెక్టర్ సురేందర్ నిన్న విజయ్ ని కలిసి స్టోరీ మొత్తం వివరించగా, ఆయనకు బాగా నచ్చడంతో, వెంటనే డేట్స్ కూడా కేటాయించాడని, జూన్ నెల నుండి ఆయన రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ నెల నుండి మూడు నెలల పాటు డేట్స్ ని కేటాయించాడట. ఇందులో పవన్ కళ్యాణ్ , విజయ్ దేవరకొండ అన్నాదమ్ములు లాగా నటించబోతున్నారని టాక్ . పవన్ ఇందులో ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఆ పాత్ర కోసమే ఆయన గత ఆరు నెలల నుండి లుక్ ని సరికొత్త మేకోవర్ ని మైంటైన్ చేస్తూ వస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా మొదలు కాకముందే అభిమానుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. పవన్ కళ్యాణ్ మామూలు డైరెక్టర్ తో పనిచేస్తేనే క్రేజ్ వేరే లెవెల్ లో ఉంటుంది. అలాంటిది సురేందర్ రెడ్డి లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ తో పని చేస్తే ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. పైగా పవన్ ని ఇందులో సరికొత్త లుక్ లో చూపించబోతుండడంతో అభిమానులు చాలా ఉత్సాహంతో ఉన్నారు. డిసెంబర్ లోపు ఈ చిత్రాన్ని పూర్తి చేసి , సంక్రాంతి బరిలో దింపే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఇకపోతే ee చిత్రం లో హీరోయిన్స్ గా ఎవరు నటించబోతున్నారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ‘ఏజెంట్ ‘, ‘నారీ నారీ నడుమ మురారి ‘ చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన సాక్షి వైద్య ఇందులో ఒక హీరోయిన్ గా ఎంపిక అయ్యినట్టు తెలుస్తోంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version