Bharta Mahashayulaku Vignapthi OTT Response: ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాల్లో, ఆడియన్స్ నుండి పాజిటివ్ రివ్యూస్ ని సొంతం చేసుకున్న చిత్రం , మాస్ మహారాజ రవితేజ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిషోర్ తిరుమల దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాలో డింపుల్ హయాతి , ఆషికా రంగనాథ్ హీరోయిన్స్ గా నటించారు. సునీల్ , వెన్నెల కిషోర్ , సత్య కామెడీ ఈ చిత్రానికి హైలైట్ గా నిల్చింది. అయితే పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఈ సినిమా థియేటర్స్ లో అనుకున్నంత రేంజ్ లో ఆడలేదు. కమర్షియల్ గా డిజాస్టర్ ఫ్లాప్ గానే మిగిలిపోయింది. కారణం రవితేజ గత చిత్రాలు వరుసగా ఫ్లాప్ అవ్వడం వల్లే. ఆ కారణం చేత ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చినా ఎవ్వరూ నమ్మలేదు, పైగా ఈ సినిమాకంటే మిగిలిన మూడు సినిమాలకు భారీ పాజిటివ్ టాక్ రావడం తో , ఆడియన్స్ చివరి ఛాయస్ గా మిగిలింది ఈ చిత్రం.
Also Read: వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ‘అల్లు సినిమాస్’..తెలుగు వాళ్లంటే అంత చులకనా?
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం ఆడియన్స్ చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని ‘జీ5’ సంస్థ కొనుగోలు చేసింది . వాళ్ళతో అనుకున్న ఒప్పందం ప్రకారం ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 13 న విడుదల చెయ్యాలి. కానీ ఎందుకో కుదర్లేదు. నిర్మాతలతో కొన్ని సుదీర్ఘ చర్చలు , లావాదేవీలు ఉండడంతో వాయిదా పడింది అంటూ వార్తలు వినిపించాయి. అయితే ఎట్టకేలకు నిన్న అర్థ రాత్రి నుండి ee సినిమా ‘జీ5’
లోకి అందుబాటులోకి వచ్చింది. థియేటర్స్ లో ee చిత్రాన్ని ఆడియన్స్ పెద్దగా చూడలేదని కారణం వల్లనో ఏమో తెలియదు కానీ, ఓటీటీ లో ఈ సినిమాకు సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. నిన్న అర్థ రాత్రి నుండి ఇప్పటి వరకు ఈ చిత్రానికి 7 లక్షల వ్యూస్ వచ్చాయని, 24 గంటలు గడిచిన తర్వాత కచ్చితంగా ఈ చిత్రం 1 మిలియన్ వ్యూస్ మార్కుని అందుకుంటుందని అంటున్నారు.
ఈమధ్య కాలం లో విడుదలైన అనేక సూపర్ హిట్ సినిమాలకు కూడా సాధ్యం అవ్వని రికార్డుని ఈ చిత్రం సొంతం చేసుకుంది. ఇదే ఊపుని కొనసాగిస్తూ ముందుకు పోతే మాత్రం కచ్చితంగా ఈ చిత్రం ఫుల్ రన్ లో అత్యధిక వ్యూస్ ని సొంతం చేసుకున్న టాప్ 10 ‘జీ5’ సినిమాల జాబితాలోకి చేరుతుందని అంటున్నారు విశ్లేషకులు. ఇక రవితేజ తదుపరి సినిమా విషయానికి వస్తే, నిన్ను కోరి వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన శివ నిర్వాణ తో ‘ఇరుముడి ‘ అనే చిత్రాన్ని చేస్తున్నాడు రవితేజ. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం , ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
