Eat Chapatis
Eat Chapatis : రాత్రి నిద్రపోయే ముందు చాలామంది భోజనం చేస్తారు. కానీ నేటి కాలంలో అనేక అనారోగ్యాలతో బాధపడుతుండడం వల్ల కొందరు వైద్యులు సూచించిన ప్రకారం లైట్ ఫుడ్ ను తీసుకుంటున్నారు. కొంతమంది లైట్ ఫుడ్ అంటే అన్నం కాకుండా మిగతా ఏ పదార్థాలు అయినా తీసుకోవడమే అని అనుకుంటున్నారు. కానీ వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉండి జీర్ణం త్వరగా అయ్యే ఆహార పదార్థాలని తీసుకోవాలి. అలాంటి వాటిలో చపాతీలు ఒకటి. చపాతీలు రాత్రి పడుకునే ముందు తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇవి తక్కువ కొవ్వును అందించి ఎక్కువ ఎనర్జీని ఇస్తాయి. ఇంకా చపాతీలు తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో చూద్దాం..
చపాతీలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. దీంతో దీనిని రాత్రి పడుకునే ముందు తినడం వల్ల కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉండవు. సాధారణంగా ఇతర ఆహారం తీసుకుంటే కడుపు ఉబ్బరంగా ఉండి మానసికంగా ఇబ్బందులు ఏర్పడతాయి. దీంతో సరైన నిద్ర పట్టదు. అయితే చపాతీలు తీసుకోవడం వల్ల ఈ సమస్య ఉండదు. పైగా త్వరగా జీర్ణమై రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. దీంతో హాయిగా నిద్ర పడుతుంది.
Also Read : రాత్రి పూట చపాతీలు తింటున్నారా? అయితే ఆలోచించండి?
చపాతీల్లో సెరొటోనిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది నిద్రపోవడానికి బాగా పనిచేస్తుంది. నిద్ర భంగం ఉన్నవారు చపాతినీ తీసుకోవడం వల్ల ఆ సమస్య నుంచి పరిష్కారం అవుతుంది. అందువల్ల రాత్రి సమయంలో చపాతీలు తిని నిద్రించడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని అంటున్నారు.
అయితే ఈ చపాతీలు అందరికీ ఆమోదయోగం కాదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. మధుమేహంతో బాధపడేవారు.. మధుమేహం రావడానికి ఆస్కారం ఉన్నవారు చపాతీలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. చపాతీల్లో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటుంది ఇవి రక్తంలో షుగర్ లెవల్సును పెంచడానికి సహకరిస్తాయి. అందువల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు చపాతీలకు దూరంగా ఉండాలి.
ఇక కొందరు చపాతీలను అధిక మోతాదులో తీసుకుంటూ ఉంటారు. ఇలా తీసుకోవడం వల్ల అదిరితే సమస్యలు ఎక్కువగా ఏర్పడతాయి. సాధారణంగా ఒక చపాతి తిన్న తర్వాత మరో చపాతి తినాలని అనిపించదు. దీంతో తక్కువ ఆహారం తీసుకుంటూ ఉంటారు. కానీ కొందరు ఎక్కువ చపాతీలను తింటూ ఉంటారు. ఇలా చేయడం ఎంత మాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
గోధుమల్లో గ్లూటన్ అనే పదార్థం ఉంటుంది. ఇది బరువు పెరగడానికి సహకరిస్తుంది. అందువల్ల ఎక్కువగా చపాతీలు తిన్నవారు బరువు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అయితే బరువు తగ్గాలని అనుకునేవారు ఒకటి లేదా రెండు చపాతీలు తినడం మంచిది. ఎందుకంటే రోజు ఇలా రెండు చపాతీలు తినడం వల్ల ఎక్కువ ఎనర్జీని పొంది తక్కువ ఆహారాన్ని తీసుకున్న వారవుతారు. ఇక చపాతీలు తీసుకున్నప్పుడు శరీరంలో ఉష్ణోగ్రత అధికంగా పెరుగుతుంది. దీంతో మలబద్ధకం సమస్య ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల శరీరంలో ఉష్ణోగ్రత అధికంగా ఉండేవారు చపాతీలకు దూరంగా ఉండటమే మంచిది. ఇలాంటివారు వారానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Also Read : ప్రతిరోజు చపాతీలు తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?