Credit Cards
Credit Cards : ఆధునిక కాలంలో ప్రజల అవసరాలు మారిపోయాయి. వాటిని తీర్చుకునేందుకు సరిపడా మనీ వారి వద్ద ఉండడం లేదు. దీంతో చాలా మంది క్రెడిట్ కార్డుల ద్వారా తమ అవసరాలు తీర్చుకుంటున్నారు. బ్యాంకులు కూడా కస్టమర్లకు క్రెడిట్ కార్డులు తీసుకునేందుకు ప్రోత్సహిస్తున్నాయి. చిన్న జాబ్ చేసే వాళ్ల దగ్గర కూడా ఒకటికి మించి క్రెడిట్ కార్డులు ఉంటున్నాయి. కాకపోతే వాటిలో అన్నింటినీ వాళ్లు ఉపయోగించరు. ఇలా ఉపయోగించని క్రెడిట్ కార్డులను కొందరు అప్లికేషన్ పెట్టుకుని మరీ వాటి క్లోజ్ చేయిస్తుంటారు. దీని వల్ల వారి క్రెడిట్ స్కోరు పై ప్రతికూల ప్రభావం పడుతుందన్న సంగతి మర్చిపోతున్నారు.ఇలాంటి సందర్భాల్లో ఏయే అంశాలను పరిగణనలోని తీసుకోవాలో ఈ వార్తా కథనంలో తెలుసుకుందాం.
* క్రెడిట్ స్కోర్ పై ప్రతికూల ప్రభావం
సాధారణంగా పాత క్రెడిట్ కార్డులను మెయింటైన్ చేస్తే క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. ఆ కార్డులను క్లోజ్ చేస్తే క్రెడిట్ స్కోర్ అకస్మాత్తుగా తగ్గిపోతుంది. ఈ నిర్ణయం క్రెడిట్ హిస్టరీలో ఈ నిర్ణయం క్రెడిట్ హిస్టరీలో ప్రతికూల అంశంగా మారిపోతుంది. ప్రత్యేకించి చాలా ఏళ్లుగా ఉపయోగిస్తున్న క్రెడిట్ కార్డులను అస్సలు క్యాన్సిల్ చేయవద్దు. దాని వల్ల మీ క్రెడిట్ హిస్టరీ స్ట్రాంగ్ గా కనిపిస్తుంది.
* క్రెడిట్ వినియోగ నిష్పత్తి
కస్టమర్లకు బ్యాంకులు అందించిన క్రెడిట్ కార్డు ద్వారా ఇచ్చే లిమిట్ ఎంత మేర వాడుతున్నారు అనే అంశాన్ని తెలిపేదే క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో అంటారు. క్రెడిట్ యూసేజ్ ఎక్కువగా ఉంటే క్రెడిట్ స్కోర్ పడిపోతుంది. క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో తక్కువగా ఉంటే క్రెడిట్ స్కోర్ అంతలా పెరుగుతుంది. అంతే కాకుండా లోన్ ఆఫర్స్, క్రెడిట్ కార్డుల ఆఫర్స్ ఎక్కువగా వస్తుంటాయి.ఎక్కువ కాలంగా ఉన్న పాత క్రెడిట్ కార్డులను క్లోజ్ చేయడం వల్ల మీకు అందుబాటులో ఉన్న ఆర్థిక వనరులు తగ్గిపోతాయి. ఫలితంగా అందుబాటులో ఉన్న క్రెడిట్ కార్డులతో ఖర్చులను పెంచుకుంటారు.. దీంతో క్రెడిట్ స్కోర్ పడిపోతుంది.
* యాన్యువల్ ఫీజులు, హిడెన్ ఛార్జీలు :
కొన్ని క్రెడిట్ కార్డులను ఉపయోగించినా, ఉపయోగించకపోయినా యాన్యువల్ ఛార్జీలను విధిస్తాయి. ఒకవేళ మీరు ఆ కార్డుతో పొందే ప్రయోజనాల కన్నా యాన్యువల్ ఛార్జీల మోత ఎక్కువగా ఉంటే దాన్ని క్లోజ్ చేయవచ్చు. ఇందుకోసం సదరు క్రెడిట్ కార్డు కస్టమర్ కేర్ కు కాల్ చేయండి. యాన్యువల్ ఫీజులో రాయితీ ఉంటుదేమో కనుక్కోండి.
* ఆర్థిక భద్రతకు చేయూత :
ఉపయోగించని క్రెడిట్ కార్డు అనేది దాచిపెట్టిన ఆర్థిక వనరు లాంటిది. ఎమర్జెన్సీలో మీకు కచ్చితంగా అవసరం అవుతుంది. చేతికి డబ్బులను అందజేస్తుంది. దాచుకున్న డబ్బులు అయిపోయినప్పుడు అప్పులు చేయాల్సిన అవసరం రాకుండా క్రెడిట్ కార్డులను వాడుకోవచ్చు. అందుకే పాత క్రెడిట్ కార్డులను అస్సలు క్యాన్సిల్ చేయవద్దు.
* మోసాలకు ఆస్కారం :
ఉపయోగించని క్రెడిట్ కార్డులు దుర్వినియోగానికి గురయ్యే ఆస్కారం ఉంది. వినియోగించని పాత క్రెడిట్ కార్డులను కూడా కనీసం నెలకోసారి చెక్ చేయాలి. వీటి వల్ల మోసాలకు ఆస్కారం ఉండదు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని ఉపయోగించని కార్డులను రద్దు చేయించే విషయంపై తుది నిర్ణయం తీసుకోండి.