Credit cards : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా క్రెడిట్ కార్డ్స్ వాడుతున్నారు. ఏ చిన్న వస్తువు కొనాలనుకున్నా కూడా తప్పకుండా క్రెడిట్ కార్డు ఉండాల్సిందే. దేశంలో కూడా క్రెడిట్ కార్డు మార్కెట్ కూడా గతంలో కంటే ఇప్పుడు బాగా పెరిగింది. ఒకోక్కరు దగ్గర ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉంటున్నాయి. ఎన్ని బ్యాంకులు అయితే ఉన్నాయో అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. అసలు షాపింగ్, సినిమా ఇలా ప్రతీ దానికి కూడా క్రెడిట్ కార్డు వాడుతున్నారు. ఆ తర్వాత వాటికి వడ్డీలు కట్టలేక కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే క్రెడిట్ కార్డు అవసరం ఉండి తీసుకున్న వారు కొందరు అయితే.. బ్యాంక్ వాళ్ల బాధ భరించలేక కొందరు మళ్లీ మళ్లీ క్రెడిట్ కార్డులు తీసుకుంటున్నారు. అసలు మనం అడగకుండా బ్యాంకు వాళ్లు క్రెడిట్ కార్డులు ఇస్తుంటారు. ఇలా ఇవ్వడానికి గల కారణం ఏంటి? కాల్ చేసి మరి బ్యాంకు వాళ్లు క్రెడిట్ కార్డు ఇవ్వడానికి ఏవైనా కారణాలు ఉన్నాయా? అసలు ఇలా క్రెడిట్ కార్డులు ఇస్తే బ్యాంకు వాళ్లకు ఏమైనా లాభాలు ఉన్నాయా? అనే పూర్తి విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Also Read : క్రెడిట్ కార్డు ను ఎక్కువగా వాడడం లేదా? అయితే ఈ సమస్యలు రావడం ఖాయం.
బ్యాంకులకు క్రెడిట్ కార్డు ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయి. కస్టమర్లు ఎంత ఎక్కువ మంది ఉండి, ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉంటే.. బ్యాంకులకు అంత లాభమంట. అందుకే కాల్ చేసి మరి బ్యాంకులు క్రెడిట్ కార్డులను ఇస్తుంటాయి. ఒక వ్యక్తి ఒక క్రెడిట్ కార్డు తీసుకున్న తర్వాత వాటికి ఛార్జీలు, వడ్డీలు, కార్డ్ కాలపరిమితి అయిపోయిన తర్వాత మళ్లీ ఛార్జీలు తీసుకోవడం ఇలా ప్రతీ విషయంలో కూడా బ్యాంకు వాళ్లు డబ్బులు లాక్కుంటారు. వీటివల్ల బ్యాంకు వాళ్లకు భారీగా డబ్బులు వస్తాయి. ఎవరైనా క్రెడిట్ కార్డు తీసుకున్న తర్వాత డబ్బులు సరైన సమయంలో చెల్లించకపోతే మాత్రం పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తారు. ఇలా చూసుకుంటూ పోతే.. ఒక్కో క్రెడిట్ కార్డు మీద చాలా లాభాలు ఉన్నాయి. అందుకే బ్యాంకు వాళ్లు కాల్ చేసి మరి క్రెడిట్ కార్డులు ఇస్తుంటారు. మళ్లీ కొన్నిసార్లు వీటిపై ఆఫర్లు కూడా పెడతారు. దీంతో ఏదైనా కొనుగోలు చేస్తే తక్కువకే వస్తాయని అంటారు. దీంతో కొందరు ఆకర్షితమై అవసరం లేకపోయినా కూడా కొన్ని వస్తువులు కొనేస్తుంటారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది క్రెడిట్ కార్డులు భారీగానే పెరిగాయి.
ఇప్పుడు ఎక్కువ మంది క్రెడిట్ కార్డు వాడుతున్నారు. అవసరానికి మించి రుణాలు తీసుకుంటున్నారు. దీంతో వారి సిబిల్ స్కోర్ తగ్గిపోయింది. సిబిల్ స్కోర్ తగ్గితే మాత్రం ఇతర బ్యాంకులు రుణాలు ఇవ్వవు. చాలా మంది ఈ రోజుల్లో ఎక్కువగా రుణాలు చేసి, బ్యాంకులకు కట్టలేకపోతున్నారు. ఆ తర్వాత ఎక్కువ వడ్డీ కడుతున్నారు.