Jobs: సీఎస్‌ఐఆర్-నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ పూణే అనుభవం ఉన్న ఉద్యోగులకు తీపికబురు అందించింది. ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసోసియేట్ – ii ఉద్యోగ ఖాళీలతో పాటు ప్రాజెక్ట్ అసోసియేట్-i ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మొత్తం 9 ఉద్యోగ ఖాళీలు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి.

35 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 25,000 రూపాయల నుంచి 42,000 రూపాయల వరకు వేతనం లభించనుంది. సంబంధిత స్పెషలైజేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు. సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read: Junior NTR- TDP: జూనియర్ ఎన్టీఆర్ తోనే టీడీపీకి మనుగడ ఉందా?
ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని తెలుస్తోంది. ఆన్ లైన్ ద్వారా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిది. 2022 సంవత్సరం ఏప్రిల్ 5 ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. https://www.ncl-india.org/ లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు, అనుభవం ఉన్న ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.
Also Read: Raj Tarun: బ్యాడ్ టైంలో గొప్ప అవకాశం.. ఫామ్ లోకి వస్తాడా ?